31.2 C
Hyderabad
Monday, June 24, 2024
హోమ్తెలంగాణఅంజుమానే మూహబ్బనే ఉర్దూ ఆధ్వర్యంలో గ్రాండ్ ముషాయిరా

అంజుమానే మూహబ్బనే ఉర్దూ ఆధ్వర్యంలో గ్రాండ్ ముషాయిరా

అంజుమానే మూహబ్బనే ఉర్దూ ఆధ్వర్యంలో గ్రాండ్ ముషాయిరా

  • తరలిరానున్న అంతర్జాతీయ స్థాయి ఉర్దూ కవులు

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి

అంజుమానే మూహబ్బనే ఉర్దూ సంస్థ ఆధ్వర్యంలో గ్రాండ్ ముషాయిరా బుధవారం నిర్వహిస్తున్నామని సంస్థ బాద్యులు అరిఫ్ ముజఫ్ఫార్,సుబ్బుర్ లు తెలిపారు. మంగళవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మిస్కీన్ అహ్మద్ ఆధ్వర్యంలో గత 45 సంవత్సరాల నుండి నుండి ఆనవాయితీ గా వస్తున్న ఉర్దూ కవి సమ్మేళనం సిద్దిపేట లో నిర్వహస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. బుధవారం రాత్రి 9 గంటల నుండి మదిన ఫంక్షన్ హాల్లో
ప్రారంభమయ్యే కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయి ఉర్దూ కవులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో బెహరేయిన్ నుండి అన్వర్ కమాల్, నేపాల్ నుండి సర్వర్ నేపాలీ, కువైట్ నుండి నజనీన్ అలీ నాజ్, జెడ్డా నుండి సమీరా అజిజ్, వివిద రాష్ట్రాల నుండి అహ్మద్ జియా, టీపీకల్ జగిత్యాల్, లతీఫుద్దీన్ లతీఫ్, ఖుర్షిద్ కసర్, తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట కు సంబంధించి చాలా మాంది ఉర్దూ కవులు పాల్గొంటారని అభిమానులు, కలకారులు కుల మాతాలకు అతీతంగా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో అతీక్ అహ్మద్, షాహిద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్