35.2 C
Hyderabad
Wednesday, April 17, 2024
హోమ్తెలంగాణఅదుపుతప్పి లారీ బోల్తా.. డ్రైవర్ మృతి

అదుపుతప్పి లారీ బోల్తా.. డ్రైవర్ మృతి

అదుపుతప్పి లారీ బోల్తా.. డ్రైవర్ మృతి

దుబ్బాక మార్చ్ 13,యదార్ధవాది ప్రతినిధి:

అదుపుతప్పి లారీ బోల్తా పడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. దుబ్బాక సబ్ ఇన్స్పెక్టర్ గంగరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హెచ్ఎంటి స్టీల్ ( ఐరన్ ) లోడ్ చేసుకొని ఎపి 29టిఏ 7447 ఓపెన్ లారీ రామాయంపేట వైపు నుండి సిద్దిపేట వైపు వస్తున్నా క్రమంలో తిమ్మాపూర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న రహదారి డ్రైవర్ గుర్తించపోవడంతో అదుపు తప్పి లారీ లోడుతో రోడ్డు పక్కన ఉన్న జెసిబి గుంతలో పడిపోయిందని  దీంతో ఒక్కడే ఉన్న డ్రైవర్ రమాకర్ యాదవ్ (32) ఎక్కడికి అక్కడే మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ఈ ఈ ప్రమాదంపై లారీ ఓనర్ సోహెబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతదేహాన్ని పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం పంపినట్లు తెలిపారు. 

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్