29.7 C
Hyderabad
Monday, June 24, 2024
హోమ్తెలంగాణఆడ, మగ వివక్ష లేని సమాజాన్ని నిర్మిద్దాం: జిల్లా కలెక్టర్

ఆడ, మగ వివక్ష లేని సమాజాన్ని నిర్మిద్దాం: జిల్లా కలెక్టర్

ఆడ, మగ వివక్ష లేని సమాజాన్ని నిర్మిద్దాం: జిల్లా కలెక్టర్

మెదక్  యదార్థవాది ప్రతినిధి

జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం జాతీయ బాలిక దినోత్సవంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టరు రమేష్, అదనపు ఎస్పీ మహేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ ఆడపిల్లలపై వివక్ష జాఢ్యాన్ని రూపు మాపాలంటే ముందు కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలని అందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని అన్నారు. ఆడపిల్లలను రక్షించడం చదివించడం వలన సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆడ మగ అనే తేడాలు పిలిచే పిలుపులో ఉండాలి తప్ప చూపించే ప్రేమలో ఉండకూడదని సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆడ పిల్లలు వివక్షకు గురవుతున్నారని అన్నారు. ఈ జాఢ్యాన్ని రూపుమాపాలంటే ముందు కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలని అందుకు ప్రతి ఒక్కరూ కంకణ బద్దులు కావాలని అన్నారు. అమ్మయిలు ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని, బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. పాఠశాలలలో విద్యార్ధి విద్యార్థినిలకు చట్టాలపై అవగాహన ప్రతి అంశం పై చర్చించే అవగాహన ఉండాలని సమాజంలో అమ్మయిలు స్నేహితులకు గాని తమ తోటి వారు సమస్యలలో ఉన్నప్పుడు ధైర్యంగా ఎదుర్కొనేందుకు తోడ్పాటు అందించాలని సూచించారు. తల్లి తండ్రులు టీచర్లు స్నేహాభావంతో ఉన్నపుడు సమాజంలో అమ్మయిలు ఎదుర్కొంటున్న సమస్యలను వారితో ధైర్యంగా చేప్పగలుగుతారని తెలిపారు.అధికారులు, ఎన్జీఓలు గ్రౌండ్ స్థాయిలో విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అమ్మయిలను గర్బస్థ శిశువు నుండి కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని బాల్య వివాహాలను అరికట్టాలని సూచించారు.అనంతరం బాలికలు సమాజానికి మణిహారం బాలికలకు రక్షణ కల్పిద్దాం వారి బంగారు భవితకు పునాది వేదం స్వేచ్ఛా యుతమైన వాతావరణం మరియు పోషకాహారం అందించి వారి అభివృద్ధికి తోడ్పడుదాం బాలికలను బ్రతకనిద్దాం చదవనిద్ధం 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేద్దాం మన వంతు సహాయం అందించి బంగారు తెలంగాణకు బాటలు వేద్దామని కలెక్టర్  అందరితో ప్రతిజ్ఞ చేయించారు. బేటీ బచావో- బేటీ పఢావో కాలెండర్ కెరీయర్ గైడెన్స్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈద్దరు అడ పిల్లలు ఉన్న తల్లితండ్రులకు సన్మానం చేశారు.  రాష్ట్ర స్థాయి బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన ఎస్సి బాలికల హాస్టల్ నర్సాపూర్ కు చెందిన మలోతు శ్రీలత ను అభినందించి శాలువా తో సన్మానించారు. ఈ సమావేశంలో డిఅర్ఓ పద్మాశ్రీ జిల్లా విద్యశాఖ అధికారి రాధా కిషన్ డిఎంఎచ్ఓ చందు నాయక్ సూపర వైజర్స్ చైల్డ్ లైన్ కోర్డినేటర్లు వివిధ బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు వివిధ ఎన్జీవోల అధికారులు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్