26.7 C
Hyderabad
Tuesday, June 25, 2024
హోమ్తెలంగాణఇంద్రవెల్లిలో కాంగ్రెస్  భారీ బహిరంగ సభ.

ఇంద్రవెల్లిలో కాంగ్రెస్  భారీ బహిరంగ సభ.

ఇంద్రవెల్లిలో కాంగ్రెస్  భారీ బహిరంగ సభ.

మంచిర్యాల యదార్థవాది ప్రతినిధి 

ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికిందని.. అందుకే సీఎం హోదాలో రేవంత్ రెడ్డి శుక్రవారం మొదటి సభ కూడా మళ్ళీ అక్కడే నిర్వహిస్తున్నామని మంత్రి సీతక్క వెల్లడించారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇంద్రవెల్లి అమర వీరుల స్మృతి వననానికి ముఖ్యమంత్రి రేవంత్  భూమి పూజ చేస్తారని తెలిపారు. అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని ఉమ్మడి జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయని ముఖ్యంగా  అభివృద్ధిపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. లక్ష మందితో ఇంద్రవెల్లి సభ జరుగుతుందని మంత్రి తెలిపారు. 

అదే సెంటిమెంట్‌తో ఇక్కడ కూడా…

కాగా వచ్చే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ పలు కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించిందని ఇంద్రవెల్లి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని రేవంత్ రెడ్డి పూరిస్తారు. గతంలో రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా  అయ్యాక 2021 ఆగస్టు 9న ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా సభను నిర్వహించిన విషయం తెలిసిందే. నేడు అదే సెంటిమెంట్‌తో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఇంద్రవెల్లి నుంచే ప్రారంభించాలని సీఎం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్