31.2 C
Hyderabad
Friday, June 21, 2024
హోమ్తెలంగాణఇసుక రవాణా పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్  పోలీసుల దాడులు

ఇసుక రవాణా పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్  పోలీసుల దాడులు

ఇసుక రవాణా పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్  పోలీసుల దాడులు

బెజ్జంకి/కోహెడ, యదార్థవాది ప్రతినిధి:

బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామ శివారులో ఉన్న వాగు వద్ద ట్రాక్టర్ నెంబర్ TS36F1239, కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తంగేళ్లపల్లి శివారులో ట్రాక్టర్ నెంబర్ TS36T9341 దానిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాడని సోమవారం టాస్క్ ఫోర్స్ పోలీస్ సిబ్బంది, బెజ్జంకి కోహెడ పోలీసులు కలసి రెండు ట్రాక్టర్లు పట్టుకున్నారు. బెజ్జంకి, కోహెడ పోలీసులు పూర్తిస్థాయిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నరు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు, బెజ్జంకి, కోహెడ పోలీసులు సంయుక్తంగా  మాట్లాడుతూ ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా చేసిన పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగిన చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం తెలిస్తే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్  8712667447, 8712667446 నెంబర్లకు సమాచారం అందించాలని అన్నారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని పోలీస్ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్