30.7 C
Hyderabad
Tuesday, June 25, 2024
హోమ్తెలంగాణఉద్యమకారుడి దారి ఎటు.?

ఉద్యమకారుడి దారి ఎటు.?

ఉద్యమకారుడి దారి ఎటు.?

* అధికారిక పార్టీ కాంగ్రెస్ వైపు !!

* బీఅర్ఎస్ పార్టీకి రాజీనామా…!

* కాల్వ నరేష్ పిఎసిఎస్ వైస్ చైర్మన్

దుబ్బాక మార్చి 4 యధార్థవాది ప్రతినిధి:

నాటి టిఆర్ఎస్ నేటి బిఆర్ఎస్ పార్టీ పుట్టిన నాటి నుండి పార్టీ కోసం కష్టపడ్డాం.. 2004 ఎలక్షన్ల నుండి 2023 ఎలక్షన్ల వరకు పార్టీ కోసం పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసిన చిన్న స్థాయి కార్యకర్తగానే ఉన్నాము. తెలంగాణ ఉద్యమంలో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో అలాగే నియోజకవర్గ ఇన్చార్జ్ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో పాల్గొని అరికాళ్ళ నుంచి మెడ దాకా ఆనాటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పోలీసులతో దెబ్బలు తిని చర్లపల్లి ఉమ్మడి జిల్లా సంగారెడ్డి లో జైళ్లలో జైలు జీవితాలు అనుభవించాం.. తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత.. మన ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించి ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు పెద్దపీట వేశారు.. మన అభ్యర్థిని ఓడించాలని ప్రతిపక్ష పార్టీలో ఉండి మనపై దాడులు చేసిన వారికి టికెట్లు ఇచ్చి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ మాకు మొండి చేయి చూపెట్టారు వాటన్నిటిని కూడా మేము మనస్సు లో పెట్టుకోకుండా పార్టీకి సేవ చేస్తే..దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అవినీతికి పాల్పడిన చైర్మన్ ఆయనకు సహకరించిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని గౌరవ శాసనసభ్యులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన వారికి వత్తాసు పలికి సొసైటీలో పనిచేసిన కార్మికులకు జీతాలు ఇవ్వాలని నిలదీస్తే మాపై చైర్మన్ దుబ్బాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించాడు. కనీసం దానిపై కూడా శాసనసభ్యులు స్పందించక పోతే మేం పార్టీలో బ్రతికున్న సచ్చిన శవాలతో సమానం ఆత్మ అభిమానాన్ని చంపుకొని పార్టీలో పని చేయలేకపోతున్నాం.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్