28.7 C
Hyderabad
Monday, June 24, 2024
హోమ్తెలంగాణఓటమి శాశ్వతం కాదు. గెలుపుకు నాంది: ఎమ్మెల్యే హరీష్

ఓటమి శాశ్వతం కాదు. గెలుపుకు నాంది: ఎమ్మెల్యే హరీష్

ఓటమి శాశ్వతం కాదు. గెలుపుకు నాంది: ఎమ్మెల్యే హరీష్

భువనగిరి యదార్థవాది ప్రతినిధి 

అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే హరీష్ రావు ఓటమి శాశ్వతం కాదు. గెలుపుకు నాంది. ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని ఆన్నారు. శుక్రవారం భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటమి శాశ్వతం కాదు. గెలుపుకు నాంది ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని ఎన్నికల హామీలను నిలబెట్టుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని,  కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చాక అసహనం పెరిగిందని రైతుబంధు పడడం లేదని జడ్పీ చైర్మన్‌గా బాధ్యతతో సందీప్ రెడ్డి అడిగితే ఆయనను పోలీసులతో బయటికి పంపించారు తప్పా సమాధానం చెప్పలేదు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నల్గొండపై ప్రేమ ఉంటే సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడాలని రైతు బంధు పడడం లేదని ప్రశ్నిస్తే చెప్పుతో కొట్టాలనడం ఏం సంస్కారం అని ప్రశ్నించారు. శ్రీశైలం సాగర్ ప్రాజెక్టులకు కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల నల్గొండకు తీవ్ర నష్టం జరగడమే కాకుండ సాగునీళ్లు తాగునీళ్లు ఉండవని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో  మన గురించి పచ్చి అబద్ధాలు చెప్తూ  బీఆర్ఎస్ బీజేపీల మధ్య సంబంధం ఉందని దుష్ప్రచారం చేసిందని బండి సంజయ్ రఘనందన్ రావు ఈటల రాజేందర్‌ల ను ఓడించింది కాంగ్రెస్ కాదని బీఆర్ఎస్సే అని అన్నారు. నర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ అపాయింట్‌మెంట్ మాత్రమే ఇచ్చింది. మరి ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎందుకివ్వలేదో విద్యార్థులకు జవాబు చెప్పాలన్నారు. వృద్ధులకు, వికలాంగులకు ఫించన్ 4 వేలకు పెంచలేదు. 2వేల ఫింఛన్‌ను కూడా సమయానికి ఇవ్వడం లేదని రైతుబంధు పింఛన్ రుణమాఫీ కరెంట్ ఉద్యోగాలు వడ్లకు బోనస్..అన్ని హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా బీఅర్ఎస్ కార్యకర్తలు ప్రచారం చేయాలి. దళిత బంధుకు మంజూరైన నిధులను ఆ కాంగ్రెస్ బ్యాంకుల్లో ఫ్రీజ్ చేసిందని ఆయన అన్నారు. తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీనే కాంగ్రెస్ బీజేపీలు వాటి స్వార్థం కోసమే పనిచేస్తాయి. బీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాల కోసమే పోరాడుతుందని అన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్