32.3 C
Hyderabad
Tuesday, June 25, 2024
హోమ్తెలంగాణకరాటేలో విద్యార్థులకు పథకాల పంట

కరాటేలో విద్యార్థులకు పథకాల పంట

కరాటేలో విద్యార్థులకు పథకాల పంట

దుబ్బాక, మార్చ్ 4 యదార్థవాది ప్రతినిధి:

ఇన్విటేషన్ నేషనల్ ఓపెన్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ కరాటే పోటీల్లో సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ విద్యార్థులు పథకాలు సాధించారు అని యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు అండ్ స్టైల్ చీఫ్ మాస్టర్ బురాని శ్రీకాంత్ తెలిపారు. విక్టరీ షోతోకన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ప్యారడైస్ క్లాసిక్ గార్డెన్ లొ రాష్ట్రస్థాయి కరాటే కుంఫు కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ కరాటే పోటీలకు సుమారు 3000 మంది విద్యార్థులు పాల్గొన్నట్టు మాస్టర్ బురాని శ్రీకాంత్ తెలిపారు. ఈ కరాటే పోటీల్లో సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన 21 మంది విద్యార్థులు 5,గోల్డ్ మెడల్స్, 4,సిల్వర్ మెడల్స్, 11బ్రౌంజ్ మెడల్స్ సాధించారు అని మాస్టర్ బురాని శ్రీకాంత్ తెలిపారు.గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రౌంజ్ మెడల్స్ సాధించిన విద్యార్థులను అలానే మాస్టర్ బురాని శ్రీకాంత్ ని విక్టరీ షోతొకన్ కరాటే అసోసియేషన్ ఇండియా వారు అభినందించారు. దుబ్బాక పట్టణం రామక్కపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల భవాని, గాయత్రి, స్వాతి గోల్డ్ మెడల్. శ్రీనిధి, అనుష శ్రీ సిల్వర్ మెడల్స్. స్పందన, మయూరి, రజిత, శ్రీవిద్య, గగన, గాయత్రి, భారతి బ్రౌంజ్ మెడల్స్.చేల్లాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సుహని సిల్వర్ మెడల్, రుతిక, భార్గవి, ప్రణీత బ్రౌంజ్ మెడల్స్. లచ్చపేట్ మోడల్ స్కూల్ ఐశ్వర్య గోల్డ్ మెడల్. దుబ్బాక మున్సిపల్ గాయత్రీ వివకనంద విద్యాలయం యశ్వంత్ గోల్డ్ మెడల్, మని దీపిక, మనశ్విన్ బ్రౌంజ్ మెడల్స్. దిశా స్కూల్ శ్రీ అద్వైత్ సిల్వర్ మెడల్ సాధించారు. అని మాస్టర్ బురాని శ్రీకాంత్ తెలిపాడు పథకాలు సాధించిన విద్యార్థులను డిఇఓ శ్రీనివాస్ రెడ్డి, జి ఈ సి ఓ ముక్తేశ్వరి మాస్టర్ బురాని శ్రీకాంత్, సురేందర్, దుబ్బాక పట్టణం రామక్కపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్. ఉషా కిరణ్, కీర్తి రవి, పిడి పద్మ, పిడి మమత అలానే చేల్లాపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రావు పిఈటి నాగేందర్ గౌడ్ పాఠశాల సిబ్బంది అభినందించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్