31.2 C
Hyderabad
Friday, June 21, 2024
హోమ్తెలంగాణకరీంనగర్‌‌లో భారీ సభకు ఏర్పాట్లు.

కరీంనగర్‌‌లో భారీ సభకు ఏర్పాట్లు.

కరీంనగర్‌‌లో భారీ సభకు ఏర్పాట్లు.

* భారత రాష్ట్ర సమితి ఎన్నికలకు సిద్ధం 

* లోక్‌సభ ఎన్నికలకు శంఖారావం పూరించనున్న కెసిఆర్.

హుస్నాబాద్ మార్చ్ 4 యదార్థవాది ప్రతినిధి:

కరీంనగర్ లో ఈనెల 12న భారీ బహిరంగ సభ‌ నిర్వహిస్తున్నట్లు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల కుమార్ తెలిపారు. కరీంనగర్‌ పార్లమెంటరీ నాయకులతో మంగళవారం సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ‌ను నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నిర్ణయించాలని కరీంనగర్‌ నుండే లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుందని, కరీంనగర్‌ పట్టణంలోని ఎస్సాఆర్ఆర్ డిగ్రీ కాలేజీ మైదానంలో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోని, ఇప్పటికే  కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందని ప్రభుత్వానికి ప్రతిపక్షపు రుచి చూపుదామని అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు రాబోతున్నాయని బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్లమెంట్ స్థానాలలో రోడ్ షోలు, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు కెసిఆర్ తెలిపారని అందుకు అనుగుణంగా జిల్లా నాయకులు కార్యకర్తలు కృషి చేసి కలిసికట్టుగా పని చేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందాంమని ఆయన అన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్