31.2 C
Hyderabad
Friday, June 21, 2024
హోమ్తెలంగాణకాంగ్రెస్ జోలికి వస్తే ఖబర్దార్..!

కాంగ్రెస్ జోలికి వస్తే ఖబర్దార్..!

కాంగ్రెస్ జోలికి వస్తే ఖబర్దార్..!

కేటీఆర్ వ్యాఖ్యలు అప్రజాస్వామికం

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కేసీఆర్ కుటుంబ సభ్యులు

మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్

మెదక్ యదార్థవాది ప్రతినిధి

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అధికారమిచ్చారని, ప్రజాస్వామ్యం ద్వారా సంక్రమించిన ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని అంటే అంతు చూస్తామని మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు రాములు నాయక్ హెచ్చరించారు. సోమవారం ఆయన మెదక్ వచ్చిన సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా బి ఆర్ ఎస్ నేతలు మాట్లాడడం దుర్మార్గమన్నారు. గత పదేళ్లుగా అప్రజాస్వామిక పాలనను నడిపించిన ఆ కుటుంబం తిరిగి అలాంటి కుట్రలకే సిద్ధపడుతుందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉన్నారని రాబోయే పార్లమెంట్ ఎన్నికల కల్లా కేసిఆర్ కుటుంబం తప్ప మరోకరు ఆ పార్టీలో మిగలరని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మెదక్ బ్లాక్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు మహమ్మద్ హఫీస్ కాంగ్రెస్ నేత సురెందర్ గౌడ్ ఉన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్