31.2 C
Hyderabad
Friday, June 21, 2024
హోమ్తెలంగాణకాంగ్రెస్ పార్టీ పీవీనీ ఉన్నత స్థానంలో నిలిపింది 

కాంగ్రెస్ పార్టీ పీవీనీ ఉన్నత స్థానంలో నిలిపింది 

కాంగ్రెస్ పార్టీ పీవీనీ ఉన్నత స్థానంలో నిలిపింది 

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి 

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు కు చిత్రపటానికి పూలమాల వేసిన టిపిసిసి సభ్యులు కేడం లింగమూర్తి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతరత్న అవార్డు రావడం చాలా సంతోషకరం అని తెలుగు బిడ్డ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వంగర గ్రామానికి చెందిన మన ప్రాంత  బిడ్డను గౌరవించి భారతరత్న ఇచ్చినందుకు ఈ ప్రాంత బిడ్డలుగా మనం ఎంతో సంతోష పడాల్సిన రోజని  కాంగ్రెస్ పార్టీ పీవీనీ ఉన్నత స్థానంలో నిలిపిందనీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుండి కాకతీయ పత్రికకు విలేకరిగా విద్యార్థి నాయకుడిగా నిజాం కు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన నాయకుడిగా చాందా క్యాంపులో కూడా ఉన్న నాయకుడు స్వతంత్రం వచ్చిన తర్వాత కరీంనగర్ పార్లమెంటుకు పోటీ చేసిన నాయకుడు అన్నారు అలాగే నాలుగుసార్లు మంథని నియోజవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది విద్యాశాఖ దేవాదాయ శాఖ వ్యవసాయ శాఖ అలాగే  రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నో పదవులు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పివి ని ఎంతో గౌరవించడం జరిగిందని అదే గౌరవంతో పివి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం ఎంతో సంక్షోభంలో ఉండగా ఆ సంక్షోభాన్ని తప్పించిన నాయకుడు మన పివి అని అన్నారు. దేశం కోసం సంస్కరణలను తీసుకొచ్చిన పివి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత గ్రామమైన చింతమడకకు ఇంటికి 10 లక్షలు ఇచ్చినట్టుగా స్వార్థపూరిత రాజకీయాలు చేయని నాయకుడని అలాగే నా ప్రాంతము అని ఆలోచన గనుక చేసి ఉంటే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేవాడు కానీ నా రాష్ట్రమే కాదు నా దేశము ముఖ్యమని దేశ ప్రజల కోసం అనునిత్యం ఆలోచన చేసిన నాయకుడు మన పీవీ నరసింహారావు అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్