31.2 C
Hyderabad
Friday, June 21, 2024
హోమ్తెలంగాణకాలుకింద కంకర.. కళ్లల్లో దుమ్ము…

కాలుకింద కంకర.. కళ్లల్లో దుమ్ము…

కాలుకింద కంకర.. కళ్లల్లో దుమ్ము…

* జాతరకు వేళయే జనానికి తప్పని తిప్పలు.

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి

సిద్దిపేట జిల్లా రూరల్ మండల పరిధిలోని పుల్లూరు గ్రామంలో రోడ్డు విస్తరణలో బాగంగా నెల కిందట పాత డాంబర్ రోడ్డును తవ్విన కాంట్రాక్టర్లు దాని స్థానంలో కోత్త రోడ్డును నిర్మించడం మరిచి, కంకర పరిచి వదిలేసారు. సిద్దిపేట నుండి గ్రామంలోకి వచ్చే మార్గాన్ని పునరుద్ధరించేందుకు కాంట్రాక్టర్ కిలో మీటరుకు పైగా తారు తొలగించి కంకర పరివగా, ఇప్పుడు చేతులెత్తేయడంతో తమకు ఇబ్బందిగా మారిందని గ్రామస్తులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గం గుండా నిత్యం 20 గ్రామాల నుంచి ప్రజలు పలు రకాల వాహనాలపై రాకపోకలు సాగిస్తుంటారు. ఈ కంకర పరిచిన రోడ్డుపై ద్విచక్ర వహనాలపై వెళ్లాలంటే అక్కడ వెలువడుతున్న దూమ్ముతో ఇబ్బందిగా మారుతుంది. వారం రోజుల్లోనే పూల్లురు బండలక్ష్మి నరసింహ స్వామీ జాతర జరగనుండగా, ఈ జాతర కు ఇతర జిల్లాల నుండి కూడా లక్షల మంది తరలి రానుండగా, వాహనదారులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ విషయం మై స్థానిక  అధికారులు  కాంట్రాక్టర్ లు వెంటనే స్పందించి పనుల పూర్తికి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్