29.7 C
Hyderabad
Monday, June 24, 2024
హోమ్తెలంగాణకుల గణనతో తెలంగాణ లోని అన్ని వర్గాలకు సమ న్యాయం

కుల గణనతో తెలంగాణ లోని అన్ని వర్గాలకు సమ న్యాయం

కుల గణనతో తెలంగాణ లోని అన్ని వర్గాలకు సమ న్యాయం

మేడ్చల్ కాంగ్రెస్ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్

మేడిపల్లి యదార్ధవాది ప్రతినిధి

తెలంగాణ లోని అన్నివర్గాలకు సమ న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న  కుల గణన నిర్ణయం అన్ని వర్గాలకు సమ న్యాయం చేస్తుందని టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు మేడ్చల్ మల్కాజిగిరి ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ అన్నారు. శుక్రవారం తెలంగాణ శాసన సభలో రాష్ట్ర‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధ్వర్యంలో తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైన నిర్ణయమన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం మేరకు నేడు శాసన సభలో బిల్లు పాస్ చేయడంతో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు సంపూర్ణ నమ్మకం పెరిగిందని అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని అసెంబ్లీ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్