25.8 C
Hyderabad
Thursday, June 13, 2024
హోమ్తెలంగాణకేసిఆర్ కట్టిన ప్రాజెక్టులు కుల్తున్నాయి: మంత్రి కోమటిరెడ్డి

కేసిఆర్ కట్టిన ప్రాజెక్టులు కుల్తున్నాయి: మంత్రి కోమటిరెడ్డి

కేసిఆర్ కట్టిన ప్రాజెక్టులు కుల్తున్నాయి: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ యదార్థవాది ప్రతినిధి

సినిమాటోగ్రఫీ, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ జిల్లాలో పలు అభివృద్ధి  కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు. ముషంపల్లిలో రూ. 99.80 కోట్ల నిధులతో నిర్మిస్తున్న రోడ్డు పనులకు, నల్గొండ పట్టణంలో నిర్మిస్తున్న స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్, పలు రోడ్లు, బ్రిడ్జిలకు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ముషంపల్లి పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కేసిఆర్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులు నిర్మాణం కాకముందే కూలిపోతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నాణ్యతకన్నా కమీషన్లపైనే దృష్టిపెట్టిందని అందువల్లే ఒక్క ప్రాజెక్టు కూడా నాణ్యంగా లేదని ప్రజాధనాన్ని వృధా చేసిన ఆ పార్టీ నాయకులు ఇవ్వాల మాకు నీతులు చెప్పడం ఏమిటని ఆయన మండిపడ్డారు. బిఆర్ఎస్ ప్రభుత్వం పాఠశాలలో ఇప్పటికీ కనీసం స్వచ్ఛమైన తాగునీరు అందింలేదు మిషన్ భగీరథ పేరుమీద వేలకోట్లు దోపిడి చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో మంత్రికి పాఠశాలలో పిల్లలకు టీచర్లకు త్రాగునీటి గురించి స్థానికులు విన్నవించగా తక్షణమే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా కిన్లీ కంపెనీ వారితో సమన్వయం చేసుకొని హైకెపాసిటీ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. నల్గొండ పట్టణంలో నిర్మిస్తున్న స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కు శంకుస్థాపన చేసిన మంత్రి అనంతరం మాట్లాడుతూ ఇది ఒక భవనం కాదని ఎందరో నిరుద్యోగ యువతీ యువకుల జీవితాల్లో కుటుంబాల్లో వెలుగులు నింపే దీపమని, రాజకీయాలు శాశ్వతం కాదని నాయకునిగా మనం చేసిన మంచి పనులే మనల్ని పదికాలాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబెడుతాయని ఆయన అన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్