25.8 C
Hyderabad
Thursday, June 13, 2024
హోమ్తెలంగాణకోహెడ వాసికి పరిశోధనా రంగంలో అవార్డు.

కోహెడ వాసికి పరిశోధనా రంగంలో అవార్డు.

కోహెడ వాసికి పరిశోధనా రంగంలో అవార్డు.

“డాక్టర్ తూమోజు జగదీశ్వరా చారి”

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి

ప్రతి సంవత్సరం జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ (జె సి ఐ) నిర్వహించబోయే పలు రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుకరించే అవార్డులో భాగంగా ఈ సంవత్సరానికి సిద్దిపేట జిల్లా  కోహెడ మండలానికి చెందిన వింజపల్లి గ్రామనివాసి డాక్టర్ తూమోజు జగదీశ్వరా చారి పరిశోధనా రంగంలో “అవుట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్ ఇన్ రిసెర్చ్, కమల్ పాత్రా అవార్డు-2024” కి ఎన్నికైనట్లు జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రాజు అరుముల పత్రిక ప్రకటనలో తెలిపారు. డాక్టర్. తూమోజు జగదీశ్వరా చారి ప్రస్తుతం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఇరవై అంతర్జాతీయ స్థాయిలో తమ పరిశోధనా పత్రాలను వెలువరించారు. గూగుల్ స్కాలర్ మరయు రిసర్చ్ గేట్ లలో పొందుపర్చబడ్డాయని, అంతేకాకుండా ఐదు అంతర్జాతీయ పత్రికలకు రివ్యూ మెంబర్‌గా ఎడిటర్‌గా ఉన్నారు. వీటితోపాటు జగదీశ్వర చారి చే రచింపబడిన

1. ఫిష్ ఫిజియాలజీ అండ్ బయో కెమిస్ట్రీ, 

2. టూల్స్ అండ్ టెక్నిక్స్ ఇన్ ఆక్వా కల్చర్ 

3. పెరిపితాన్ బేస్డ్ ఆక్వాకల్చర్ (అను మూడు పుస్తకాలను అమేజాన్,ఫ్లిప్ కార్టు లాంటి వాటి ద్వారా కొనుగోలు చేయబడుతున్నాయని తెలిపారు. వివిధ రంగాలలో విశిష్ట ప్రతిభను కనబర్చిన వారికి ఈ అవార్డును ఈనెల నాలుగో తేదీ ఆదివారం నర్సయ్య భవన్ మంచిర్యాలలో జరగబోయే సమావేశంలో అందించనున్నట్లు తెలియజేశారు. జగదీశ్వరా చారి కోహెడ మండలంలో గతంలో నిర్వహించబడిన శ్రీరామ జూనియర్ కళాశాల చైర్మన్ గా తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ జే.ఏ.సి చైర్మన్ గా మంచి మన్ననలు పొంది అంచలంచెలుగా ఎదిగిన వారికి ఈ సందర్భంగా మిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తంచేశారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్