24.7 C
Hyderabad
Thursday, June 13, 2024
హోమ్తెలంగాణఖభార్ధార్ బాల్కసుమన్.

ఖభార్ధార్ బాల్కసుమన్.

ఖభార్ధార్ బాల్కసుమన్.

కొండపాక యదార్థవాది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనుచిత వ్యాఖ్యలతో అవమాన పరిచిన చెన్నూర్ మాజీ శాసనసభ్యుడు బాల్క సుమన్ పైన కాంగ్రెస్ నాయకులు కంప్లెయింట్ చేశారు. అధికారం కోల్పోయిన బీఆరెస్ నాయకులు మతి భ్రమించి నోరు పారేసుకుంటున్నారని ఈ పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయిని హెచ్చరించారు కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, విశ్వనాథ పల్లి, రవీందర్ నగర్ మాజీ సర్పంచ్ వాసరి లింగారావు. ప్రజల మనస్సు గెలిచే రీతిలో రేవంత్ రెడ్డి పాలన చూసి బీఆరెస్ నాయకులకు నిద్ర పట్టడం లేదన్నారు, నోటికి వచ్చినట్లు వాగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు, విద్యార్ధి నాయకునిగా మొదలైన నీ జీవితం ఇపుడు వందల కోట్లుకు అధిపతిగా ఎలా అయ్యావో ప్రజలు తెలుసని అన్నారు.

మైనంపల్లికి ఘన స్వాగతం

మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి సిద్దిపేట కి వస్తున్న సందర్బంగా కొండపాక స్టేజీ వద్ద బోనాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం దుద్దెడ టోల్ ప్లాజా వద్ద గజమాలతో సత్కరించారు కొండపాక మండల కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమం లో ఉమ్మడి కొండపాక మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి , కొండపాక మండల ప్రస్తుత అధ్యక్షులు వాసరి లింగారావు. వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్