31.2 C
Hyderabad
Friday, June 21, 2024
హోమ్తెలంగాణగృహ వాణిజ్య, వ్యవసాయ అవసరాలకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేస్తాం: మంత్రి పొన్నం 

గృహ వాణిజ్య, వ్యవసాయ అవసరాలకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేస్తాం: మంత్రి పొన్నం 

గృహ వాణిజ్య, వ్యవసాయ అవసరాలకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేస్తాం: మంత్రి పొన్నం 

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి 

సిద్దిపేట జిల్లా పట్టణంలోని విద్యుత్ కేంద్రంలో 220 కేవీ/132 కేవీ ట్రాన్స్ఫార్మర్స్  పేలిపోవాదంతో బుధవారం రాత్రి విద్యుత్ అంతరాయం కలిగిన నేపథ్యంలో గురువారం రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విద్యుత్ శాఖ అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నరు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గృహ వాణిజ్య, వ్యవసాయ అవసరాలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా విద్యుత్ సరఫరా చేస్తామని అన్నారు. గృహ వినియోగదారులు, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రమాదం జరిగిన వెంటనే హైదరాబాద్ నుండి ట్రాన్స్కో డైరెక్టర్ జగత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విద్యుత్ శాఖ ఎస్ఇ అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చి పక్క ట్రాన్స్ఫార్మర్ కు వ్యాపించకుండా చర్యలు తీసుకొని సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ నుండి గృహ అవసరాలకు  విద్యుత్ పునరుద్ధరించడం జరిగిందని ఉదయం 5 గంటలకు వ్యవసాయానికి కూడా సరఫరా చేయడం జరిగిందని అన్నారు. విద్యుత్ ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు నష్టం అంచనా వేయడానికి ప్రాథమిక విచారణ జరిపించేందుకు ప్రభుత్వం తరఫున  అధికారులను ఆదేశిస్తామని పేలిపోయిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చాలా పాతది. అది ఇప్పటికే దానికి కెపాసిటీ మించి పనిచేసిందని అన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్