24.7 C
Hyderabad
Thursday, June 13, 2024
హోమ్తెలంగాణగెలుపే లక్ష్యంగా పని చేయాలి.

గెలుపే లక్ష్యంగా పని చేయాలి.

గెలుపే లక్ష్యంగా పని చేయాలి.

* రాష్ట్రాన్ని ఆగం చేస్తున్న కాంగ్రెస్

* కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటా

* మాజీ ఎమ్మెల్యే రసమయి

హుస్నాబాద్ మార్చ్ 9 యదార్థవాది ప్రతినిధి:

రానున్న లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మానకొండూరు మాజీ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శనివారం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో  మానకొండూర్ మాజీ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అధిక మెజార్టీ సాధించాలని బిఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడవద్దని, మీ అందరిని కంటికి రెప్పలాగా చూసుకుంటానని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు నేను చేసిన సేవ తెలుసు కానీ కల్లబొల్లి మాటలతో కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి రా గలిగింది.. ప్రజలను మభ్యపెట్టి మాయమాటలు చెప్పి ఆరు గ్యారంటీలు అంటూ సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన మోసపూరిత కాంగ్రెస్ పార్టీ కి తగిన గుణపాఠం చెప్పాలని హామీలు నెరవేరేత వరకు ప్రజల పక్షాన పోరాడాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రజలను ఆగం చేస్తుందని వాళ్ల వైఫల్యాలను ఎండగడుతూ ఇంటింటికి తిరిగి గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను పథకాలను  ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు తెలిపారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ గత ఐదేళ్లలో పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో శూన్యం.. నేటికీ కరీంనగర్ అభివృద్ధి కాలేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి, చింతకింది శ్రీనివాస్ గుప్తా, బోయినపల్లి శ్రీనివాస్ రావు,ఎంపీటీసీ ల ఫోరమ్ మండల అద్యక్షులు దుంబల రాజా మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు,మాజీ ఏఎంసి చైర్మన్ కచ్చు రాజయ్య, సోషల్ మీడియా ఇంచార్జి ఎల శేఖర్ బాబు, మండల అధికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్,ఎలుక దేవయ్య, దీటి రాజు,వంగల నరేశ్, యువజన అద్యక్షులు బిగుల్ల మోహన్,దీటి బాలనర్సు,పర్శరాములు,తిరుపతి, గ్రామశాఖ అద్యక్షులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్