31.2 C
Hyderabad
Friday, June 21, 2024
హోమ్తెలంగాణగొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం

గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం

గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం

-నర్సింగ్ ఆఫీసర్ల పెండింగ్ లో ఉన్న జీతాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి

-మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు

రాష్ట్రంలో కొత్తగా నియమితులైన నాలుగు వేల మంది నర్సింగ్ ఆఫీసర్ల నాలుగు నెలల పెండింగ్ లో ఉన్న జీతాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఎక్స్ వేదికగా స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏడు వేల మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలలుగా వారికి జీతాలు మాత్రం చెల్లించడం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది తప్ప, వారి జీత భత్యాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదని,
దీంతో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నియమితులైన నాలుగు వేల మంది నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు అందక అష్టకష్టాలు పడుతు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు లేని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల జీతాలును తక్షణం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్