25.7 C
Hyderabad
Sunday, June 16, 2024
హోమ్తెలంగాణగ్రామాలలో మీ సేవలు ఆదర్శంగా తీసుకుంటాం.

గ్రామాలలో మీ సేవలు ఆదర్శంగా తీసుకుంటాం.

గ్రామాలలో మీ సేవలు ఆదర్శంగా తీసుకుంటాం.

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి 

హుస్నాబాద్ మండలంలో పదవీకాలం పూర్తయిన 17 గ్రామాల సర్పంచుల ఆత్మీయ సమ్మేళన సన్మాన కార్యక్రమం హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో హుస్నాబాద్ మండల ఎంపీపీ లకావత్ మానస ఆధ్వర్యంలో ఏర్పాటు 17 గ్రామాల సర్పంచులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు ఈ ఐదు సంవత్సరాల కాలంలోని వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ఎండిఓ రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ పదవి కాలం పూర్తయిన సర్పంచ్ లకు  ధన్యవాదాలు తెలిపారు. గ్రామాలలో మీ సేవలు ఆదర్శంగా తీసుకుంటామని పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా కొత్తగా వచ్చిన పంచాయతీ సెక్రటరీలు పంచాయతీ సర్పంచ్లు గ్రామంలోని వీధులను ఇంటిని గ్రామ పరిసరాలను శుభ్రం చేసి గ్రామం ప్రగతికి తోడ్పడిన సర్పంచులకు కృతజ్ఞత తెలిపారు. అనంతరం ఎంపీపీ లకావత్ మానస మాట్లాడుతూ మీ పదవీకాలంలో గర్వంగా చెప్పుకోగలిగే పనులే చేశారు కాబట్టి చిరస్థాయిలో మీ పేరు నిలిచేటట్లు అభివృద్ధిలో పాల్గొని కృషి చేశారని తెలిపారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల కొరకై వ్యక్తిగత జీవితాలను పక్కనపెట్టి, ప్రజాసేవకై ముందుండి  నడిపించిన తీరు అభినందనీయమన్నారు. నిత్యం ప్రజాసేవకై ఉదయం నుండి రాత్రి వరకు ఈ ఐదు సంవత్సర కాలంలో అందుబాటులో ఉండి, కరోనా సమయంలో గ్రామాలలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు పనులను ధైర్యంగా ముందుండి నడిపి సహాయ సహకారాలు అందించిన సర్పంచులకు  కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్