26.7 C
Hyderabad
Sunday, June 16, 2024
హోమ్తెలంగాణచచ్చిన పామును ఎవరైనా చంపుతారా: రేవంత్ రెడ్డి.

చచ్చిన పామును ఎవరైనా చంపుతారా: రేవంత్ రెడ్డి.

చచ్చిన పామును ఎవరైనా చంపుతారా: రేవంత్ రెడ్డి.

హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి 

పోలీస్ కానిస్టేబుల్స్ కు నియామక పత్రాలను అందించిన రేవంత్ రెడ్డి. బుధవారం ఎల్బీ స్టేడియంలో 13,444 పోలీస్ కానిస్టేబుల్స్ కు నియామక పత్రాలను అందించిన ముఖ్యమంత్రి రేవంత్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నుంచి బయట పడేయాలనే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఆనాటి పాలకులు తమ కుటుంబం కోసం ఆలోచించారు తప్ప నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదని అన్నారు. మా కుటుంబం 4కోట్ల తెలంగాణ ప్రజలు అందుకే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తీసుకున్నామని న్యాయపరమైన చిక్కులు తొలగించి నియామక పత్రాలు అందిస్తున్నామని 13,444 మంది ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్నారనీ అన్నారు. ఈ వేదికగా చెబుతున్నా.. మీ రేవంతన్నగా నిరుద్యోగ యువకులకు అండగా ఉంటా ఈ ప్రభుత్వం మీది.. ఇది పేదల ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం వేసిన చిక్కుముడులను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ  ముందుకు వెళుతున్నాం ఇదివరకే నర్సింగ్ ఆఫీసర్స్ సింగరేణి ఉద్యోగాల్లో చిక్కుముడులు విప్పి నియామకాలు పూర్తి చేసుకున్నమని ఆయన అన్నారు. కేసీఆర్ తన బంధువులకు కుటుంబ సభ్యులకు పదవులు లేకపోతే వంద రోజులు కూడా ఆగలేకపోతున్నారు కానీ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల గురించి కేసీఆర్ ఆలోచించనెలేదు తెలంగాణ సమాజం నిన్ను బహిష్కరించిందని ఇప్పటికైనా మీకు అర్థం కాలేదా అని అన్నారు. మంగళవారం నల్లగొండకు వెళ్లిన కేసీఆర్ బీరాలు పాలిచ్చే బర్రెను కాదని ప్రజలు దున్నపోతును తెచ్చుకున్నారని అంటుండు ఇదేనా మన తెలంగాణ భాష ప్రజలు తెలివైన వారు కాబట్టి కంచెర గాడిదను ఇంటికి పంపి రేసుగుర్రాన్ని తెచ్చుకున్నారనీ అన్నారు. ఏ రేసుకు వెళ్లినా గుర్రాలదే గెలుపు తప్ప కంచెర గాడిదలది  కాదు.. అధికారం పోగానే నన్ను చంపుతారా అని కేసీఆర్ అంటుండు.. చచ్చిన పామును ఎవరైనా చంపుతారా.. కేసీఆర్ నీ పని అయిపోయింది.. నీ దుఖాన్ బంద్.. మా ప్రభుత్వంలో ఏ తప్పు లేకుండా ఎవరికి నష్టం జరగకుండా 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని పదేళ్లు నియామకాలు లేకపోవడంతో నిరుద్యోగులు నష్టపోతారని వయసు 44 నుంచి 46 ఏళ్లకు పెంచాం మీ ఆశీర్వాదం ఉంటే పదేళ్లు కాదు 20ఏళ్లు ప్రజా ప్రభుత్వమే ఉంటుంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు ఇవేదిక నుండి సూటిగా సవాల్ విసురుతున్నా.. పదేళ్లు వెంట్రుక కూడా పీకలేవ్.. గత పదేళ్లలో కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి మనకు రావాల్సిన నీటిని రాకుండా కేసీఆర్ ఒక్క సంతకంతో కేసీఆర్ తెలంగాణకు మరణశాసనం రాశారు. అది మేడిగడ్డ కాదు.. మేడిపండు.. పొట్ట విప్పితే పురుగులు బయటపడతాయనే  నల్లగొండలో సభ పెట్టారు. తెలంగాణను కబలించడానికి గంజాయి డ్రగ్స్  ముఠాలు తిరుగుతున్నాయనీ గంజాయి ముఠాను కూకటివేళ్లతో పెకిలించాల్సిన బాధ్యత మీపై ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్