31.2 C
Hyderabad
Friday, June 21, 2024
హోమ్తెలంగాణచేయూత అంటే ఇదేనా.!

చేయూత అంటే ఇదేనా.!

చేయూత అంటే ఇదేనా.!

* జనవరి నెల ఆసరా పెన్షన్లు ఇంకెప్పుడిస్తారు

* రూ.రెండు వేలకు బదులు రూ.నాలుగు వేలు ఇస్తామన్నారు.

* కనీసం ఆ రెండు వేల కూడా దిక్కులేదు.

* పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు ఎదురు చూపు.

* కాంగ్రెస్ సర్కారు పై సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సటైర్లు.

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి

కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయూత అంటే ఇదేనా.. వృద్ధులు వికలాంగులు ఆసరా లేని అభాగ్యులంతా నెలవారీ పెన్షన్ల కోసం ఎదురుచూసే పరిస్థితిని వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఫిబ్రవరి నెల నడుస్తున్నా నేటికీ జనవరి నెలకు సంబంధించిన పెన్షన్లను ఖాతాల్లో ఎందుకు జమ చేయలేదని సిద్దిపేట జిల్లాతో పాటు పలు జిల్లాల్లో పెన్షన్లు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. “చేయూత” పథకం ద్వారా గత డిసెంబర్ నెల నుండే 4 వేల రూపాయల పెన్షన్ ఇస్తామని హామీలు తప్ప సమయానికి కనీసం రెండు వేల రూపాయలు కూడా ఇవ్వడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రెండు వందల రూపాయలున్న పెన్షన్ ను రెండు వేల రూపాయలుగా పెంచి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా కల్పించారని గుర్తు చేశారు. ఈ పెన్షన్ డబ్బులతోనే నెలవారీ సరుకులు మందులకు వైద్య ఖర్చులకు ఇతర అవసరాలకు వినియోగించుకున్నారని అన్నారు. ప్రస్తుతం పెన్షన్ డబ్బులు ఆలస్యం కావడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని గడిచిన పదేళ్ళలో పెన్షన్ కోసం లబ్ధిదారులు రోడ్డెక్కి ఆందోళనలు చేసిన సంఘటనలు లేవని కేవలం రెండు నెలల వ్యవధిలోనే పెన్షన్లను సమయానికి ఇవ్వకుండా దాటవేస్తున్నారని తక్షణమే జనవరి ఫిబ్రవరి నెలలకు సంబంధించిన పెన్షన్ రూపాయలను పెన్షన్ దారుల ఖాతాల్లో జమ చేయాలని శుక్రవారం ఎమ్మెల్యే హరీష్ రావు పత్రిక ప్రకటనలు తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్