23.2 C
Hyderabad
Sunday, July 14, 2024
హోమ్తెలంగాణచేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలి

చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలి

చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలి

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి 20 జూన్
2024

రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పదివేల రూపాయలు ఇయ్యాలని బీఆర్ఎస్ నాయకులు సామల్ల సాయిప్రేమ్ అన్నారు. గురువారం సిద్దిపేట హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలలో చేసిన చేవెళ్ల డిక్లరేషన్ను వెంటనే అమలు చేసి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పదివేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం ద్వారా ప్రతి గూడెం, తండాలకు ప్రతీ ఏడు ఇస్తానన్న ఇరువైఅయిదు లక్షల రూపాయలు వెంటనే విడుదల చేయాలని, అంబేద్కర్ అభయహస్తం పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు పన్నెండు లక్షల ఆర్థిక సహాయాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు.
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అమలుకాని హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, రెండువేల పెన్షన్ రెండువేల అయిదు ఇస్తామని ఇప్పటికి కూడా అమలు చేయలేదని అన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సామల్ల సాయిప్రేమ్, గుడికందుల నరేష్, భూక్య భిక్షపతి నాయక్, సందులపురం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్