31.2 C
Hyderabad
Friday, June 21, 2024
హోమ్తెలంగాణజాతీయస్థాయి బేస్ బాల్ పోటీలకు తంగళ్ళపల్లి విద్యార్థిని

జాతీయస్థాయి బేస్ బాల్ పోటీలకు తంగళ్ళపల్లి విద్యార్థిని

జాతీయస్థాయి బేస్ బాల్ పోటీలకు తంగళ్ళపల్లి విద్యార్థిని
‌ ‌

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్ళపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని కుమారి సూర హర్షిని ఇటీవల వరంగల్లో జరిగిన 67వ రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీలలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి బేస్బాల్ పోటీలకు అండర్ 14 విభాగంలో ఎంపిక కావడం అయి జనవరి 28 నుండి ఫిబ్రవరి 1 వరకు ఛత్తీస్ ఘడ్ లోని కోర్బాలో జరిగే జాతీయస్థాయి బేస్బాల్ పోటీలలో పాల్గొననుందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సాంబరాజు పద్మ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పామునాగేశ్వరి విద్యార్థినిని అభినందిస్తూ జాతీయస్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపికైన సూర హర్షిణి శుభాకాంక్షలు తెలిపి రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లే జాతీయస్థాయిలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అండర్-14 విభాగంలో అంతర్జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపిక కావాలని విద్యార్థిని కి సూచిస్తూ, విద్యార్థికి శిక్షణనిచ్చిన పి.ఈ.టి రాజ్ కుమార్ ని, ప్రోత్సహించిన ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సాంబరాజు పద్మ ను ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపిటిసి కోన శేఖర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సి ఆర్ పి విద్యార్థినీ, విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్