26.7 C
Hyderabad
Sunday, June 16, 2024
హోమ్తెలంగాణజిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా నియామక పత్రాన్ని అందించిన: చెరుకు 

జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా నియామక పత్రాన్ని అందించిన: చెరుకు 

జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా నియామక పత్రాన్ని అందించిన: చెరుకు 

దుబ్బాక మార్చ్ 7, యదార్థవాది ప్రతినిధి:

దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బాధ్యులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధిగా మచ్చ శ్రీనివాస్ కు గురువారం నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, పార్టీలో సామాన్య కార్యకర్తలకు కూడా పదవులు అందుతాయని ఇందుకు నిదర్శనం నేడు జిల్లా అధికార ప్రతినిధిగా శ్రీనివాస్ ను  బాధ్యతలు ఇవ్వడం సంతోషం కలిగించిందని తెలిపారు.  మచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీకి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంకుంట నర్సరెడ్డి, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బాధ్యులు శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. సిద్దిపేట జిల్లాలో పార్టీ బలోపేతానికి చేస్తానని రాబోవు పార్లమెంటు ఎన్నికలలో సిద్దిపేట జిల్లా నుండి అత్యధికంగా ఓట్లు రా బట్టేందుకు కృషి చేస్తానని, ఇందుకు ప్రతి ఒక్క కార్యకర్తతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్, దుబ్బాక మున్సిపాలిటీ అధ్యక్షుడు నర్మెట్ట ఏసు రెడ్డి, దుబ్బాక మండల పార్టీ అధ్యక్షుడు కొంగరి రవి, పార్టీ నాయకులు ఆకుల భరత్, దేవుని రాజు, సలీం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్