26.7 C
Hyderabad
Tuesday, June 25, 2024
హోమ్తెలంగాణటీఎన్జీవో జిల్లా అధ్యక్షుడిగా దొంత నరేందర్

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడిగా దొంత నరేందర్

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడిగా దొంత నరేందర్

మెదక్ యదార్థవాది ప్రతినిధి

తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల (టీఎన్జీవో) మెదక్ జిల్లా అధ్యక్షుడిగా మెదక్ పట్టణానికి చెందిన దొంత నరేందర్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఎన్జీవో భవన్ లో సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారిగా తోట కుమార్ నీల వ్యవహరించగా జిల్లా పరిధిలోని ఏడు యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు డిపార్ట్మెంట్ల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు జిల్లా కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. జిల్లా కార్యదర్శిగా రాజ్ కుమార్ అసోసియేట్‌ అధ్యక్షుడిగా ఇక్బాల్ పాషా కోశాధికారిగా చంద్రశేఖర్‌ ఉపాధ్యక్షులుగా మనోహర్ ఫణీరాజ్ ఫజులొద్దిన్ అర్షద్ రఘునాథ్ రావు మహిళా ఉపాధ్యక్షులుగా లీలా జెయింట్ సెక్రటరీ శంకర్ చిరంజీవ చార్యులు శివాజీ కిరణ్ కుమార్ రాధ కార్యాలయ కార్యదర్శి సలీం స్పోర్ట్స్ కల్చరల్ సెక్రటరీ గోపాల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ విష్ణువర్థన్ రెడ్డి ప్రచార కార్యదర్శి నర్సింలు ఈసీ మెంబర్లు మరియా శ్రీదేవి తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు తనపై మరింత బాధ్యత పెరిగిందని ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తానని సమస్యలు ఉంటే సంఘం దృష్టికి తీసుకురావాలని సత్వర పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఏడుపాయల వనదుర్గ చేగుంట తూప్రాన్ మరియు అల్లాదుర్గం యూనిట్లలో టీఎన్జీవోల భవనాల ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనర్సింహ జిల్లా కలెక్టర్ శాసనసభ్యుల సహకారంతో పూర్తి చేస్తానన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో చేరవేస్తూ టీఎన్జీవో సంఘ కార్యకలాపాలను సమర్ధవంతంగా నిర్వహిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గాండ్ల అనురాధ జిల్లాలోని అన్ని యూనిట్ల డిపార్ట్మెంట్ ఫోరంల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్