30.7 C
Hyderabad
Tuesday, June 25, 2024
హోమ్తెలంగాణతమరే మాకు న్యాయం చేయండి 

తమరే మాకు న్యాయం చేయండి 

తమరే మాకు న్యాయం చేయండి 

* జిల్లా కలెక్టర్ ను కోరిన జర్నలిస్టులు

* అర్హులైన జర్నలిస్టులకు లబ్ధి చేయాలి

హుస్నాబాద్, మార్చి యదార్థవాది ప్రతినిధి:

సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హుస్నాబాద్ జర్నలిస్ట్ హక్కు పోరాట సమితి జర్నలిస్టు లు సిద్దిపేట జిల్లా కు నూతనంగా వచ్చిన పరిపాల అధికారి మిక్కిలినేని మను చౌదరి కు శాలువాతో ఘనంగా సన్మానించి,శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జర్నలిస్టు ల యొక్క సమస్యల వివరించి వినతిపత్రాన్ని సమర్పించారు .హుస్నాబాద్ మండల పరిధిలోని జర్నలిస్టులకు 2022 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం హుస్నాబాద్ పట్టణ శివారు కిషన్ నగర్ లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద సర్వే నెంబర్ 293 యందు ఎ 2-07 గుంటలు  ప్రభుత్వ భూమిలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం జరుగుతున్నది. కానీ ఇందులో అర్హులైన జర్నలిస్టులను కాదని గతంలో లబ్ధి పొందిన వారిని ఇతర మండలాల చెందిన వారిని జాబితాలో ఎంపిక చేయడం వల్ల అర్హులైన పేద జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఈ విషయం పై గతంలో హుస్నాబాద్ తాసిల్దార్, ఆర్డీవో, సిద్దిపేట జిల్లా జాయింట్ కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నోడల్ అధికారి హుస్నాబాద్ ఎమ్మార్వో, డిపిఆర్ఓ ఇచ్చిన జర్నలిస్టుల జాబితా తప్పుడు తడకగా ఉందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. ఇప్పటికీ అయిన విచారణ జరిపి అర్హులైన లబ్ధిదారులకు ఇండ్ల,ఇండ్ల స్థలాల పంపిణీ చేసి తగు న్యాయం చేయాలని జిల్లా పరిపాల అధికారి  కోరినట్లు జర్నలిస్టు హక్కుల పోరాట సంఘం  సభ్యులు తెలిపారు.

మునుపటి వ్యాసం
తదుపరి ఆర్టికల్
RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్