31.2 C
Hyderabad
Friday, June 21, 2024
హోమ్ఆంధ్రప్రదేశ్తెలంగాణ శాఖకు తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం అడహక్ కమిటీ ఏర్పాటు

తెలంగాణ శాఖకు తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం అడహక్ కమిటీ ఏర్పాటు

తెలంగాణ శాఖకు తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం అడహక్ కమిటీ ఏర్పాటు

రాష్ట్ర అడహక్ కమిటీ కన్వీనర్ గా గజ్జల శ్రీనివాస్ ఏకగ్రీవం

మరో 20మంది కో కన్వీనర్ లుగా నియామకం చేసిన మేడవరపు రంగనాయకులు

హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి

తెలంగాణ శాఖకు అడహక్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు మేడవరపు రంగనాయకులు తెలిపారు. హైదరాబాద్ లో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం కార్యాలయంలో సోమవారం తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హైదరాబాద్ తో సహా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు ముఖ్యఅతిథిగా విచ్చేసి కన్వీనర్ కో కన్వీనర్లను నియమించడం జరిగినది. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం కు తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలు, నియోజకవర్గాలు వారిగా కన్వీనర్ల ను నియమించాలని తెలియజేశారు. ఫిబ్రవరిలో రాష్ట్ర కమిటీ ఏర్పాటుచేసి, నూతన డైరీ ఆవిష్కరణ కార్యక్రమం పైన పలు చర్చలు జరిపినారు హైదరాబాదులో ఈ ఏడాది ఉగాది పండుగ సందర్భంగా తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలను ప్రదానం చేయాలని సంఘం తీర్మానించడం జరిగినది. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించామని, ఈ ఏడాది తెలంగాణలో నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలుగు జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం, భరోసా నినాదాలతో ఏర్పాటు చేసిన తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రెండు రాష్ట్రాలలోనూ తమ కార్యక్రమాలను నిర్వహిస్తుందని, ఎంతో ఉన్నత లక్ష్యాలతో సంఘం కార్యకలాపాలు సాగిస్తోందని మేడవరపు రంగనాయకులు స్పష్టం చేశారు.
ఈ సమావేశం అనంతరం బీసీఎన్ ఛానల్ చైర్మన్, తెలంగాణ కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ ను మేడవరపు రంగనాయకులు తో పాటు, సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకుని సంఘం యొక్క విధివిధానాలు, లక్ష్యాల గురించి చర్చించారు. సంఘానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తామని జితేందర్ తెలిపారు. ఈ సమావేశంలో వివిధ జిల్లాల నుండి సంఘ నాయకులు వారు సూచనలు సలహాలు తెలిపినారు. ఈ సమావేశంలో దద్ధాల జగదీష్, కో – కన్వీనర్ లు మాలి కరుణాకర్ పటేల్, తిరుమల వెంకటేశ్వర్లు, కంచుకట్ల ప్రకాష్, గాడి పెళ్లి పరమేశ్వర్, మునిగే మహేందర్, భోగి బాబు, బింగి సత్తయ్య, నామాల విశ్వేశ్వరావు, బెలిదె హరినాథ్, ఏ.ఎం.రాజిరెడ్డి, బాపట్ల కృష్ణమోహన్, కుర్లి శ్రీకాంత్ రెడ్డి, నల్ల రామకృష్ణ, జ్యోతి ప్రశాంత్, బాబురావు, నాగేంద్ర, ప్రేమ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్