31.2 C
Hyderabad
Friday, June 21, 2024
హోమ్తెలంగాణదుద్దెడ లో భూ  కబ్జాను అడ్డుకోవాలి 

దుద్దెడ లో భూ  కబ్జాను అడ్డుకోవాలి 

దుద్దెడ లో భూ  కబ్జాను అడ్డుకోవాలి 

గజ్వెల్ యదార్థవాది ప్రతినిధి 

ధరలు పెరిగి భూములవిలువ అమాంతం ఆకాశనాన్నటడం వల్ల సంతోషపడాలో కబ్జాకోరలకు బలి అవుతున్ననందుకు ఏడవాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి, తాజాగా రాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న దుద్దెడ గ్రామంలో ప్రస్తుతం ఇదే తంతు నడుస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కంటికి కనిపించిన ఏ స్థలాలను వదలకుండా కబ్జాలు చేస్తున్నారని, కుంటస్థలాలను, నక్ష బాటలను  సైతం వదలకుండా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని దుద్దెడ గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  కొండపాక మండల పరిధిలోని దుద్దెడ గ్రామంలో టోల్ గేట్ వద్ద ఉన్న చాకలికుంటను, నక్ష బాటను కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి గోడను నిర్మిస్తున్నారని, తాతల కాలం నుంచీ అక్కడ వ్యవసాయ భూములు ఉన్నాయని, అప్పటి నుండి వ్యవసాయ పొలాలకు కుంట, నక్ష బాట దారి ఉండేదని.. ఇటీవల కాలంలో కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ కుంటను ఆక్రమించుకొని కబ్జాను చేసి నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. సుమారు ఏళ్లుగా  నడుస్తున్న నక్ష బాటను, కుంట స్థలాలను రియల్ వ్యాపారులు ఆక్రమిస్తే తమ వ్యవసాయ పొలాలకు ట్రాక్టర్లు హార్వెస్టర్లు ఎలా వెళ్తాయని అని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై కొండపాక మండల తహసిల్దార్ చల్లా శ్రీనివాస్ కు శుక్రవారం వినతిపత్రం ఇచ్చి కబ్జా చేసి గోడ నిర్మిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నక్షబాటను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.

–  రైతుల భూముల పై అక్రమార్కుల కన్ను 

 సాదా కాగితం, నోటి మాట ద్వారా 60 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసి సాగు చేస్తున్న భూములను కొంతమంది వ్యక్తులు తిరిగి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దుద్దెడ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుద్దెడ గ్రామంలోని సర్వే నంబర్ 456,457,458,463 తో పాటు మరి కొన్ని సర్వే నంబర్లను నర్ర లలితా బాయ్ అలియాస్ గుర్రాల లలితా బాయ్ వద్ద నుండి 50 సంవత్సరాల క్రితం డబ్బులు చెల్లించి సాదా కాగితం, నోటి మాట ద్వారా కొనుగోలు చేసినట్లు రైతులు తెలిపారు. ఆనాటి నుండి నేటి వరకు ఆ భూములను అలాగే సాగు చేసుకుంటున్నామని, ఆ భూములకు సంబంధించిన కొన్ని వివరాలు ధరణిలో నమోదు కాలేదని, ఇప్పటికీ ధరణి లో లలితా బాయ్ పేరు పైనే రికార్డు రావడంతో ఇదే అదనుగా భావించిన వారి వారసులైన అమరేందర్ రెడ్డి ఆ భూములపై కన్నేసి వాటిని లాక్కునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు రైతులు తెలిపారు. ప్రైవేటు సర్వేయర్లతో సర్వే చేస్తూ మార్కింగ్ ఇస్తున్నారని, అడ్డుకున్న రైతులపై దాడి చేసి తిడుతున్నారని వారు వాపోయారు.  వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్న తమకు న్యాయం చేసి తమ భూములను అక్రమార్కుల పాలు కాకుండా చూడగలరని కోరుతున్నారు. ఇదే విషయమై కొండపాక మండలం ఎమ్మార్వో తాసిల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చినట్లు రైతులు తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్