31.2 C
Hyderabad
Friday, June 21, 2024
హోమ్ఆంధ్రప్రదేశ్దొరకునా ఇటువంటి సేవ.!

దొరకునా ఇటువంటి సేవ.!

దొరకునా ఇటువంటి సేవ.!

వెండితెరను స్వర్ణమయం

చేసిన కళాతపస్వి..

మహా మనస్వి..

అపార తేజస్వి..

చిరయశస్వి..

ఒక్కసారి కళ్ల ముందు తిరుగుతున్న రీళ్లు..

సినిమాలు కావవి 

దృశ్యకావ్యాలు..

అపురూపంగా నర్తిస్తున్న

సిరిసిరిమువ్వ..

అద్భుతంగా అభినయిస్తున్న

సీతామాలక్ష్మి..

కళ్ళెదుట కూర్చుని పాడుతున్న శంకరశాస్త్రి..

అభినయపరాకాష్ట

సాగరసంగమం..

పురోగమన భావాల

జలనిధి.. సప్తపది..

అపూర్వ చిత్రరాజాల

సినీమా రుషి

దర్శకత్వ ఖుషి..

స్వయంకృషి..

కాశీనాథుని ఆగమనమే

తెలుగు సినిమాకి

శుభోదయం..

శుభసంకల్పం..

శుభప్రదం..

పెరిగిన దర్శకుల 

ఆత్మగౌరవం..

కళాఖండాల ఆవిర్భావానికి

వెలుగురేఖ..శుభలేఖ..

వెండితెరపై అందంగా

పరచుకున్న

సిరివెన్నెల…

దర్శక దిగ్గజం

ప్రతి సినిమా ఒక స్వాతిముత్యం..

మహానటులు 

చిన్ననాటిస్నేహితులు

ఎందరో మహానుభావులు

ఆయన విజయాల్లో

సూత్రధారులు..

గొప్ప సినిమా

ఆయన జీవనజ్యోతి

మొత్తంగా సినిమా

విశ్వనాధుని జీవితనౌక

మంచి సినిమా కోసం 

ఆర్రులు చాచిన 

అభిమానులకు

ఆయన ఆపద్బాంధవుడు..!

మనకు ఎన్నో కళాఖండాలను అందించిన

అభిమాన దర్శకుడు

కళాతపస్వి విశ్వనాథ్ 

వర్ధంతి వేళ అక్షరనివాళి

 ఎలిశెట్టి సురేష్ కుమార్

       

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్