25.8 C
Hyderabad
Thursday, June 13, 2024
హోమ్తెలంగాణపట్టణంలో ట్రాఫిక్ పోలీసుల వరుస స్పెషల్ డ్రైవ్ 

పట్టణంలో ట్రాఫిక్ పోలీసుల వరుస స్పెషల్ డ్రైవ్ 

పట్టణంలో ట్రాఫిక్ పోలీసుల వరుస స్పెషల్ డ్రైవ్ 

కరీంనగర్ యదార్థవాది ప్రతినిధి 

కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ ప్రజల భద్రత దృష్ట్యా తీసుకునే చర్యల్లో భాగంగా కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు వరుస స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమేష్ మాట్లాడుతూ గురువారం కరీంనగర్ కమీషనరేట్ ట్రాఫిక్ పోలీసులు ఆటోల పై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు పొల్యూషన్ ఇన్సూరెన్సులు లేని ఆటోలను గుర్తించి వాటిని సీజ్ చేస్తు ఈ చలాన్ ద్వారా జరిమానాలు విధించామన్నారు. అంతే కాకుండా వారి ఆటోలపై గల జరిమానా రుసుము చెల్లించిన తదితర ధ్రువపత్రాల నమోదు అప్పటికప్పుడు చేసిన పిదపే సదరు ఆటోలను వదిలిపెట్టేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ నందు 49 ఆటోలను గుర్తించి పట్టుకున్నామని కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా ఆటో నడిపే వ్యక్తులు డ్రైవింగ్ లైసెన్సు తో పాటుగా వాహనానికి సంబందించిన అన్నీ సరైన ధ్రువపత్రాలు కలిగివుండాలని ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వాహనదారులని గుర్తించడమే కాకుండా వారికి ఈ చలాన్ ద్వారా జరిమాన కూడా విధిస్తామన్నారు. కరీంనగర్ లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ లు  ఇకపై నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తో పాటుగా సబ్ ఇన్స్పెక్టర్ ఇషాక్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్