31.2 C
Hyderabad
Friday, June 21, 2024
హోమ్తెలంగాణపర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలి: జిల్లా ఎస్పీ అఖిల్

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలి: జిల్లా ఎస్పీ అఖిల్

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలి: జిల్లా ఎస్పీ అఖిల్ 

సిరిసిల్ల యదార్థవాది ప్రతినిధి 5 జూన్ 2024

చెట్లను పెంచడం సామాజిక బాధ్యతగా చూసినప్పుడే భావితరాలకు కాలుష్యరాహిత సమాజాన్ని అందించగలమని జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ అఖిల్ మహజన్ అన్నారు. బుధవారం సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో  సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలోని రగుడు చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు సాగిన సైకిల్ ర్యాలీలో పాల్గొని మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ, పోలీస్ అధికారులు, యువకులు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోని చెట్లను పెంచడం ద్వారా భావితరాలకు కాలుష్యరాహిత సమాజాన్ని అందిగలమని స్వచ్ఛమైన అహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడనికి మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్కను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని, ఫలితంగా అక్కడ ఉండే వారి యొక్క ఆలోచన విధానం కూడా మారుతుందని అన్నారు. ప్రకృతి మనకు ఎంత ముఖ్యమైనదని, ప్రకృతి తరువాతనే జీవకోటి భూమి పైకి వచ్చిందన్న విషయం చరిత్ర చెప్పిన సత్యం అని అన్నారు. భూ మండలం పై పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు, ప్రాణ వాయువు అయిన ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు, వర్షాలు పడేందుకు, విపత్తుల సమయం లో చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని , భూమి మీద పశుపక్షాదుల నివాసం చెట్లే నని, మానవ జీవన విధానంలో చెట్ల పాత్ర ఎంతో ముడిపడి ఉందని అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ  చంద్రయ్య, డిఎస్పీ నాగేంద్రాచరి, సి.ఐ లు రఘుపతి, శ్రీనివాస్ గౌడ్,వీరప్రతాప్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఆర్.ఐ లు యాదగిరి, రమేష్, ఎస్.ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

మునుపటి వ్యాసం
తదుపరి ఆర్టికల్
RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్