24.7 C
Hyderabad
Thursday, June 13, 2024
హోమ్తెలంగాణపెట్టు బడి దారులను అందలం ఎక్కిస్తున్న నరేంద్ర మోదీ

పెట్టు బడి దారులను అందలం ఎక్కిస్తున్న నరేంద్ర మోదీ

పెట్టు బడి దారులను అందలం ఎక్కిస్తున్న నరేంద్ర మోదీ

* దేశ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఈ పార్లమెంటు ఎన్నికలు.

* మోదీ ప్రధాని అయ్యాక వంద లక్షల కోట్ల అప్పులు చేశారు.

* దేశంలో జీఎస్టీ తెచ్చి సామాన్యల భవిష్యత్తు దెబ్బ తీశారు.

* సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి.

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి 

రానున్న పార్లమెంటు ఎన్నికలు భారత దేశ ప్రజల భవిష్యత్తు చూపే ఎన్నికలని మల్లి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజా స్వామ్యం బతికి వుండదని రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేసి పెట్టుబడి దారులకు తాకట్టు పెట్టిందని భారత కమ్యునిస్టుపార్టీ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. శనివారం  హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత ఘర్షణలు ఎక్కువయ్యయని కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు 50 లక్షల కోట్ల అప్పులైతే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక 100 లక్షల కోట్ల అప్పులయ్యయని చాడ  దుయ్యబట్టారు. నరేంద్ర మోడీ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ డిజిల్ పెట్రోల్ వంట గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా పెంచి జీఎస్టీ తెచ్చి సామాన్య ప్రజల భవిష్యత్తు దెబ్బ  తీయాలని కుట్ర చేసి పెట్టు బడి దారులకు కొమ్ము కాస్తున్న నరేంద్ర మోడీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేక పవనాలు చూసి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి అనే భయంతో ఇప్పుడు మల్లి రాముడి జపం చేస్తూ జనంలోకి రావడం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదిగడం ఖాయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటివల ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేసేందుకు పెండింగ్ లో ఉన్న గౌరవెల్లి గండిపెల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేసేందుకు, కృష్ణా జలాల వాట ప్రజా సమస్యల పరిష్కారానికి సిఎం కృషి చేయాలని అందుకు వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డిని చాడ కోరారు. సిద్దిపెట జిల్లాలో దీర్ఘకాలికంగా ఉద్యోగులుగా పని చేస్తున్నావారు మరి కొందరు ఉద్యోగులు ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అలాంటి ఉద్యోగులపై రాష్ట్ర రొడ్డు రావణా బిసి సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ జిల్లా ఇంఛార్జి మంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ కోరారు. ఈ విలేఖరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యెడల వనేష్ అందే అశోక్ అక్కన్నపేట కొహెడ మండలాల సిపిఐ కార్యదర్శులు కొమ్ముల భాస్కర్ ముంజ గోపి సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజీవరెడ్డి, శివలింగ్ కృష్ణ, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి వేల్పుల శ్రీనివాస్, ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగాం రాజు కుమార్,ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జెరిపోతుల జనార్దన్, సిపిఐ మండల నాయకులు అయిలేని మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్