25.7 C
Hyderabad
Sunday, June 16, 2024
హోమ్తెలంగాణపొట్లపల్లి స్వయంభు దేవస్థానం లో శివరాత్రికి సర్వం సిద్ధం

పొట్లపల్లి స్వయంభు దేవస్థానం లో శివరాత్రికి సర్వం సిద్ధం

పొట్లపల్లి స్వయంభు దేవస్థానం లో శివరాత్రికి సర్వం సిద్ధం

హుస్నాబాద్ మార్చ్ 7, యదార్థవాది ప్రతినిధి:

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రసిద్ధ శివాలయాలు ముస్తాబు అవుతున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా పొట్లపల్లి స్వయంభు రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఈవో కిషన్ రావు మాట్లాడుతూ వేములవాడ రాజన్న దేవాలయం తర్వాత రాష్ట్రంలో పొట్లపల్లిలోని శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినదని, 1996 నుండి శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి వారు భక్తుల పూజలు అందుకుంటూ కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ప్రసిద్ధి చెందారని, ఈ నెల 7 శుక్రవారం నుండి 8, 9 తేదీలలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయని, శివరాత్రి పర్వదినాన
రాజేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు అర్చనలు జరుగుతాయని,
శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేస్తే సప్త జన్మలలోని పాపములు తొలగిపోయి, అన్ని శుభములే కలుగుతాయని పురాణాలు చెప్పుతున్నాయని ఆయన అన్నారు. అలాగే దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని గడిచిన సంవత్సరం కంటే ఈసారి శివరాత్రి ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్