31.2 C
Hyderabad
Friday, June 21, 2024
హోమ్తెలంగాణప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం మనది

ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం మనది

ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం మనది

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి 

హుస్నాబాద్ బీఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసిన మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం-భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చిందని 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిందని ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంట్టున్నాం భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా  పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించిందని శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థల ఏర్పాటు ఆయా వ్యవస్థల అధికారాలు బాధ్యతలు వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోందని అన్నారు. భారత దేశ స్వాతంత్రం కోసం ఎంతగానో కృషి చేసిన స్వాతంత్ర సమరయోధులందరినీ స్మరించుకుంటూ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఅర్ఎస్ పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్