28.7 C
Hyderabad
Sunday, June 23, 2024
హోమ్తెలంగాణప్రజా తీర్పును గౌరవిస్తాం.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలి..

ప్రజా తీర్పును గౌరవిస్తాం.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలి..

ప్రజా తీర్పును గౌరవిస్తాం.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలి..

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి 

చిగురుమామిడి మండల కేంద్రంలో  మంగళవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బీజేపీలు చేసే తప్పుడు ప్రచారాలను దీటుగా తిప్పి కొట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాల్సిన ప్రాధాన్యతను బీఅర్ఎస్ పార్టీ శ్రేణులకు వివరించారు. అలాగే కార్యకర్తల కష్ట సుఖాల్లో తోడు ఉంటానని అదైర్యపడవద్దని బరోసానిచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోయినపల్లి వినోద్ కుమార్ కు హుస్నాబాద్ నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి గా ఉన్న పొన్నం ప్రభాకర్ స్థానిక డిపోకు మరిన్ని బస్సులు కొనుగోలు చేసి మహిళలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలని సూచిస్తు ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే హామీల అమలు సాధ్యం అవుతుందని మళ్లీ మాట మార్చడం సరైనది కాదని హామీలను ఎగనామం పెట్టే ప్రయత్నం అన్నది అందరికీ తెలుసు. ఒకవేళ మీరుహామీలు అమలు చేయని పక్షంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని అన్నారు. అంతే కాకుండా సిఏం రేవంత్ రెడ్డీ  మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మీద వ్యక్తిగత దూషణలు అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలనీ గౌరవప్రదంగా ఉండాలని హితవు పలికారు ప్రజా తీర్పుని గౌరవిస్తాం. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్