31.2 C
Hyderabad
Friday, June 21, 2024
హోమ్తెలంగాణప్రతి బీఅర్ఎస్ కార్యకర్తను కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం

ప్రతి బీఅర్ఎస్ కార్యకర్తను కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం

ప్రతి బీఅర్ఎస్ కార్యకర్తను కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం

యదార్తవాది ప్రతినిధి గజ్వెల్ 

మండల పరిధిలోని అంకిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన అన్వర్ రాంపల్లి గ్రామానికి చెందిన చిట్యాల రాములు గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో విశ్వనాధ్ పల్లి గ్రామానికి చెందిన గొడుగు దేవవ్వ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో మృతి చెందారు ముగ్గురికి బిఆర్ఎస్ పార్టీ సభ్యులకు రెండు లక్షల చొప్పున మొత్తం  6 లక్షలరూపాయల చెక్కులను ఎఫ్ డి సి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి శనివారం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఅర్ఎస్ అద్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గజ్వేల్ నియోజకవర్గంలో సుమారు 97 వేల పైచిలుకు బీఅర్ఎస్ కార్యకర్తలకు  సభ్యత్వాలను ఇచ్చామన్నారు. ఇప్పటివరకు కేవలం గజ్వేల్ నియోజకవర్గం లోనే 338 కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చెక్కులను కార్యకర్తల కుటుంబాలకు ఇవ్వడం జరిగిందన్నారు. కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి పట్టుకొమ్మలని  కార్యకర్తలకు అందరికీ ఏ ఆపద వచ్చిన అండగా ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం కొండపాక మండల అధ్యక్షుడు చింతల సాయిబాబా మాజీ సిద్దిపేట జిల్లా సర్పంచ్ ఫోరం  అధ్యక్షుడు మహాదేవ్ గౌడ్ మర్పడగ ఎంపిటిసి ఆంజనేయులు రాంపల్లి నూనె కుమార్ యాదవ్ మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులు అహ్మద్ రవీందర్ సున్నపు భాస్కర్ అంకిరెడ్డిపల్లి రవీంద్ర నగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు రాసుల నరేందర్ కోడెల మల్లేశం పిఎసిఎస్ డైరెక్టర్ వెంకటేష్, తేలు యాదగిరి కిరణ్ ప్రదీప్ కనకయ్య గొడుగు స్వామి బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్