28.2 C
Hyderabad
Wednesday, June 12, 2024
హోమ్తెలంగాణప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యతనిస్తూ పరిపాలనను ముందుకు తీసుకెళ్లడమే నా  లక్ష్యం: జిల్లా పరిపాల అధికారి.

ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యతనిస్తూ పరిపాలనను ముందుకు తీసుకెళ్లడమే నా  లక్ష్యం: జిల్లా పరిపాల అధికారి.

ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యతనిస్తూ పరిపాలనను ముందుకు తీసుకెళ్లడమే నా  లక్ష్యం: జిల్లా పరిపాల అధికారి.

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి 

సిద్దిపేట జిల్లా పరిపాల అధికారిగా మిక్కిలినేని మను చౌదరి బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా నియమించబడిన జిల్లా పరిపాల అధికారిగా 2017 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన మిక్కిలినేని మను చౌదరి శనివారం బాధ్యతలు తీసకున్నారు. నూతన కలెక్టర్ కుటుంబ సమేతంగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకోగా జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) గరిమా అగ్రవాల్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి కలెక్టరేట్ ఏఓ అబ్దుల్ రెహమాన్ లు స్వాగతం పలికారు. బదిలీపై వెళ్తున్న జిల్లా పరిపాల అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ నుండి జిల్లా పరిపాల అధికారి గా మిక్కిలినేని మను చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు పరిపాల అధికారి, జిల్లా అధికారులు పరిపాల అధికారి కార్యాలయ సిబ్బంది ఇతర శాఖల అధికారులు సిబ్బంది. పరిపాల అధికారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా జిల్లా పరిపాల అధికారి మాట్లాడుతూ ప్రభుత్వ ముఖ్య పథకాలకు ప్రాధాన్యతనిస్తూ పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లడమే జిల్లా అధికారిగా తన ప్రధానమైన లక్ష్యమని తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులను పూర్తిగా పరిశీలించి వాటిని త్వరగా పరిష్కరించుటకు సంబంధిత జిల్లా అధికారులతో ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ పాఠశాలలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు, మౌలిక వసతులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సరైన మోటివేషన్ ఇప్పించి కార్పొరేట్ స్థాయికి మించి ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తాన్నారు. జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి భూకబ్జాలు జరగకుండా చర్యలు తీసుకుంటా అబ్దుల్ కలాం చెప్పినట్టు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని కష్టపడి కృషి చేస్తే యువత విజయాలను సాధిస్తారని అన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్