25.8 C
Hyderabad
Thursday, June 13, 2024
హోమ్తెలంగాణప్రభుత్వ మార్గదర్శనంలో జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా చేస్తాం: కలెక్టర్ అనురాగ్

ప్రభుత్వ మార్గదర్శనంలో జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా చేస్తాం: కలెక్టర్ అనురాగ్

ప్రభుత్వ మార్గదర్శనంలో జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా చేస్తాం: కలెక్టర్ అనురాగ్

సిరిసిల్ల యదార్థవాది ప్రతినిధి 

75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజు మనందరికి పండుగ రోజు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా భారతదేశమును నిలుపుకునేందుకు భారతరత్న డా. బి.ఆర్. అంబేడ్కర్ సారథ్యంలో భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి తెచ్చుకున్నం భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించిన అమరవీరులకు భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగవేత్తలకు ఈ సందర్భంగా నా జోహార్లు అర్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా 6 గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తుందని ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల లోపునే ‘అభయహస్తం’ ఆరు గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకం (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) 09-12-2023న ప్రారంభించగా నేటివరకు జిల్లాలో వేములవాడ సిరిసిల్ల డిపోల పరిధిలో 20 లక్షల 5 వేల జీరో టికెట్లపై మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సహాయాన్ని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగిందని అన్నారు. అభయహస్తం గ్యారెంటీలైన మహాలక్ష్మీ పథకం పేరుతో మహిళలకు ప్రతీ నెల  2 వేల 500 రూపాయల ఆర్థిక సహాయం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ రైతు భరోసా పథకం కింద రైతులకు, కౌలు రైతులకు ఏటా ఎకరాకు 15 వేల రూపాయల పెట్టుబడి సాయం వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే కూలీలకు ఏటా 12 వేల రూపాయలు గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ ను ఖర్చు చేసే పేద కుటుంబాలకు ఉచిత గృహ విద్యుత్ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం పంపిణీ చేయూత పథకం కింద వయో వృద్ధులు వితంతువులు చేనేత కార్మికులు డయాలసిస్ ఎయిడ్స్ పైలేరియా ఒంటరి మహిళ కల్లుగీత బీడీ టేకేదారులలో అర్హులైన వారికి 4 వేల రూపాయల చొప్పున ఫించన్లు మరియు 6 వేల రూపాయల చొప్పున దివ్యాంగులకు ఫించన్లు యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డును అందించేందుకు ‘ప్రజా పాలన’ కార్యక్రమాన్ని 28-12-2023 నుండి 06-01-2024 వరకు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని అన్నారు.

జిల్లా ప్రజల నుంచి వచ్చిన 1 లక్షా 92 వేల 544 అర్జీలను కంప్యూటరీకరించడం చేశామని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా శాసనసభ ఎన్నికలను స్వేచ్ఛాయుత ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా జిల్లాలో నిర్వహించుకున్నాం.

సంస్థాగత ప్రసవాలు పెంపు

జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఏరియా ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంస్థాగత ప్రసవాల సంఖ్యను 80 శాతం పైగా పెంచాలన్న లక్ష్యంతో  “మిషన్ 80” పైలట్ ప్రాజెక్టుగా చేపట్టడం జరిగిందని ప్రభుత్వ ఆసుపత్రులలో గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో 54 శాతం మాత్రమే ప్రసవాలు జరగగా వైద్యారోగ్య సిబ్బంది కృషితో డిసెంబర్ -2023 మాసంలో 80 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాం

పల్లెల సమగ్రాభివృద్ధి

పల్లెల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి  పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గ్రామాలలో పరిశుభ్రత పచ్చదనం పెంపుకు ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా కృషి  దేశవ్యాప్తంగా గత సంవత్సరం  నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023 సర్వేలో పారిశుద్ధ్య విభాగంలో రాజన్న సిరిసిల్లకు 5 స్టార్ రేటింగ్ లభించింది అన్నారు.

కార్మిక, ధార్మిక క్షేత్రాల అభివృద్ధి

కార్మికక్షేత్రమైన జిల్లా కేంద్రం సిరిసిల్లతోపాటు దక్షిణ కాశీగా పేరు గాంచిన ధార్మికక్షేత్రం వేములవాడ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందని ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఆధ్యాత్మిక పట్టణం  వేములవాడను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సిరిసిల్ల పట్టణం ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ పట్టణంగా జాతీయ స్థాయిలో ధృవీకరించబడిందని 

మార్చి మాసంలో వేములవాడలో  నిర్వహించే మహాశివరాత్రి వేడుకలను భక్తులు మెచ్చేలా నేత్రపర్వంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నాం అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తున్న ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్ లోని మహాత్మ జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో ప్రతీ మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ ప్రజావాణిని జిల్లాలో మరింత పకడ్బందీగా నిర్వహించడానికి చర్యలు జవాబుదారీతనం పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రజావాణి  అర్జీల గుణాత్మక పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నాం శాంతి సామరస్యం వెల్లివిరిసిన సమాజంలో మాత్రమే వికాసం సాధ్యమవుతుందని ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీలేకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం ముందుకు సాగుతుందన్నారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ఎస్పీ అఖిల్ మహాజన్ అదనపు కలెక్టర్లు పి.గౌతమి ట్రెయినీ ఐపిఎస్ రాహుల్ రెడ్డి ఎన్. ఖీమ్యా నాయక్ ఆర్డీఓ లు ఆనంద్ కుమార్ మధుసూధన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగయ్య జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంతకముందు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తన అధికారి క్యాంపు కార్యాలయంలో గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు బహుకరించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్