26.7 C
Hyderabad
Sunday, June 23, 2024
హోమ్తెలంగాణప్రార్థన ప్రదేశాలలో మెరుగైన సౌకర్యాలు అందించాలి: మహమ్మద్ అజీజ్

ప్రార్థన ప్రదేశాలలో మెరుగైన సౌకర్యాలు అందించాలి: మహమ్మద్ అజీజ్

ప్రార్థన ప్రదేశాలలో మెరుగైన సౌకర్యాలు అందించాలి: మహమ్మద్ అజీజ్

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి

షబే భారత్ ను పురస్కరించుకొని ఈనెల 25న ముస్లీం సోదరులు పవిత్ర (పెద్దల పండుగ) జాగారం చేసి ఖబరస్తాన్ మజీద్ లలో ప్రార్థనల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని మంగళవారం సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణికి వినతి పత్రం అందించిన తంజీమ్ ఉల్ మజీద్ సిద్దిపేట శాఖ అధ్యక్షులు మహమ్మద్ అజీజ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట పటణంలో ఉన్న ప్రార్థన, ఖబరస్తాన్లలో మెరుగైన సౌకర్యాలు అందించాలని అలాగే ఖబరస్తాన్లలో చెత్త పిచ్చి మొక్కలను తొలగించి ఖబరస్థాన్లలో వీధి దీపాలు రాత్రి వేళలో వెలిగేలా ప్రతి మజీద్ వద్ద వచ్చే వారికి ఇబ్బంది కలుగకుండా ఎల్.ఇ.డి. లైట్లు ఏర్పాటు చేయాలని అలాగే మసీదుల వద్ద పరిసరాలలో శుభ్రంగా క్లీన్ చేయించలని  అన్నారు. అలాగే రంజాన్ మాసంలో ప్రతి మసీద్లలో సాయంత్రం వేళలో (ఇఫ్తార్ తరువాత) తడి చెత్త, పొడి చెత్త అని కాకుండా స్పెషల్ డ్రైవ్ క్రింద చెత్తను తరలించలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్