31.2 C
Hyderabad
Friday, June 21, 2024
హోమ్తెలంగాణబిస్మిల్లా బైతుల్ అధ్వర్యంలో నిరుపేదలకు సహాయం

బిస్మిల్లా బైతుల్ అధ్వర్యంలో నిరుపేదలకు సహాయం

బిస్మిల్లా బైతుల్ అధ్వర్యంలో నిరుపేదలకు సహాయం

దుబ్బాక మార్చ్ 6 యధార్థవాది ప్రతినిధి:

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లోని బిస్మిల్లా బైతుల్ మాల్ తరఫున నిరుపేదలకు ప్రతీ నెల రెండువందల రూపాయలు అందజేయడం జరుగుతుందని ట్రస్ట్ చైర్మన్ మహమ్మద్ చాంద్ అన్నారు. ఈ సందర్భంగా అయన
మాట్లాడుతూ ఉన్నతంగా ఉన్న మహమ్మదీయులు ఒక్కొక్కరు లక్షకు ఇరువైఅయిదు వందల వరకు బిస్మిల్లా బైతుల్ ట్రస్ట్ కు సహాయం చేస్తుంటారని, వారు చేసిన సహాయాన్ని ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు ప్రతీ నెల రెండువందల రూపాయలు అందజేయడం జరుగుతుందని, ప్రతీ ఒక్కరు తమవంతు విదిగా తోడుపటుకై లక్షకు ఇరువైఅయిదు వందలు రూపాయలు ఇస్తే బీద మహమ్మదీయుల నిరుపేద మహిళల నిఖ ఖర్చుల నిమిత్తం సహాయం చేయడం జరుగుతుందని, చనిపోయిన మహమ్మదీయుల మట్టిలో కలపడానికి ఖర్చులకు ట్రస్ట్ సభ్యులు అందజేస్తారని ఆయన తెలిపారు. అలాగే జకాత్ ఫిత్రాత్ ను వచ్చే నెల పవిత్రమైన రంజాన్ మాసంలో బిస్మిల్లా బైతుల్ మాల్ లో జమ చేసి ట్రస్ట్ యొక్క పుణ్య కార్యక్రమాలలో తోడ్పాటు అందించాలని ఇది మనం చేసే సహాయం పెద్దదని అనుకోకుండా చిరు సహాయంగా మన నిరుపేద మహమ్మదీయులకు సహాయం చేస్తే పుణ్యం వస్తుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో మహమ్మద్ చాంద్ మియా మహమ్మద్ అమీర్ అలీ మహమ్మద్ సమీర్ ఫోజియా బేగం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్