25.8 C
Hyderabad
Thursday, June 13, 2024
హోమ్తెలంగాణభరోసా కేంద్రం మహిళలకు అండగా

భరోసా కేంద్రం మహిళలకు అండగా

భరోసా కేంద్రం మహిళలకు అండగా

మహిళలకు ఆత్మసైర్యాన్ని పెంచేందుకే ఈ భరోసా కేంద్రం

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ 

మెదక్ యదార్థవాది ప్రతినిధి 

సమాజంలోని మహిళలకు బాలికలకు భరోసా ఒక విశ్వాసమని భరోసా కేంద్రం ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ  అన్నారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రంలో భరోసా  కేంద్రాన్ని నూతన భవనాన్ని ఆయన ప్రారంభోత్సవం చేశారు. జిల్లా కేంద్రంలో మహిళలకు మహిళలకు ఆత్మసైర్యాన్ని పెంచేందుకే ఈ భరోసా కేంద్రం అని ఆయన అన్నారు. గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ వారి సౌజన్యంతో రెండు కోట్ల రూపాయల నిర్మాణంతో భరోసా సెంటర్ నిర్మాణం అయిందని జిల్లాలో 2022 సంవత్సరంలో ఆగస్టు నెలలో ప్రారంభమైన భరోసా కేంద్రం 135 కేసులను పరిష్కరించి బాధ్యత మహిళలకు 25 లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించడం జరిగిందని మంత్రి తెలిపారు. భరోసా కేంద్రం మహిళలకు అండగా నిలిచి బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తే పోక్సో  చట్టం కింద నేరమనే విషయం అందరికి తెలియాలని భరోసా కేంద్రాలు బాధిత మహిళలకు సత్వర న్యాయం వైద్యం పరిహారం అందించేందుకు కృషి చేస్తాయని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్, డిఐజి రేమ రాజేశ్వరి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ డాక్టర్ బి. బాలస్వామి పోలీస్ సిబ్బంది భరోసా సఖి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్