31.2 C
Hyderabad
Friday, June 21, 2024
హోమ్తెలంగాణభూఅక్రమార్కులపై కఠిన చర్యలు

భూఅక్రమార్కులపై కఠిన చర్యలు

భూఅక్రమార్కులపై కఠిన చర్యలు

* సెస్ అక్రమాల పై కఠిన చర్యలు తీసుకుంటా

*:మంత్రి పొన్నం ప్రభాకర్

సిరిసిల్ల యదార్థవాది ప్రతినిధి 

జిల్లాలో భూఅక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలనీ జిల్లా యంత్రాంగానికి

రాష్ట్ర రవాణా, బీసి సంక్షేమ శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. మంగళవారం అభివృద్ధి సంక్షేమ పై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలెక్టర్ అనురాగ్ జయంతి అదనపు కలెక్టర్ ఎన్ ఖిమ్యా నాయక్ జిల్లా ఫారెస్ట్ అధికారి బాలమని తో కలిసి సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014 కు ముందు ప్రభుత్వ భూమిగా రికార్డ్ లో ఉండి తర్వాత అన్యాక్రాంతం అయిన భూముల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్యాక్రాంతం అయిన భూములను బూబకాసరుల కబంధ హస్తాల నుంచి విడిపించి తిరిగి స్వాధీనం చేసుకోవాలనీ అన్నారు. స్వాధీనం చేసుకున్న స్థలాలను విద్యా సంస్థల నిర్మాణాలు ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోవాలి జిల్లాలో బిడ్డ పెళ్లి కోసమో తమ బిడ్డల ఉన్నత చదువుల కోసమో ముందు చూపుతో పైసా పైసా కూడ బెట్టి కొనుగోలు చేసిన ప్లాట్ లను సైతం రాజకీయ పలుకుబడి అధికారుల అండ కండ బలంతో కబ్జాకొరులు కైంకర్యం చేసిన ఘటనలు ఉన్నాయన్నారు. తమ స్థలాలను ఎవరైనా ఆక్రమించుకుంటే ప్రజలు తగు ఆధారాలతో జిల్లా కలెక్టర్ ఎస్పీలకు ఫిర్యాదు చేయాలని అన్నారు.  సెస్ లో అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని సెస్ లో అలసత్వం అక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఉపేక్షించేదిలేదని సెస్ లో జరిగిన అక్రమాల గురించి ప్రజలకు ఏదైనా సమాచారం ఉంటే ఆధారాలతో తీసుకువస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రభుత్వం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రత్యక చర్యలు తీసుకుంటుంది

సిరిసిల్ల నేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా వెన్నుదన్నుగా ఉంటుందని ఈ విషయంపై ప్రభుత్వం ఇప్పటికే కూలంకషంగా చర్చించిందని సిరిసిల్ల నేతన్నలకు 365 రోజులు పని కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందని బతుకమ్మ చీరలతో పాటు పాలి కాటన్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం వస్త్ర తయారీకి అవసరమైన యార్న్ ను ప్రభుత్వమే సరఫరా చేయనుందని వర్కర్ టు ఓనర్ పథకానికి లబ్ధిదారులను గుర్తించేందుకు సేట్లు ఆసాములతో కాకుండా నేరుగా కార్మికులు కార్మిక సంఘాలు ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను తీసుకావాలని సంబంధిత అధికారులకు సూచించారు. వర్కర్ టు ఓనర్ పథకం కింద పవర్ లూమ్ లు లేని కార్మికులకు యూనిట్లను కేటాయిస్తామని మంత్రి తెలిపారు. టెక్స్టైల్ పార్క్ లో 2014 కు ముందు 119 పవర్ లూమ్  యూనిట్ లు ఉండగా 2023  నాటికి 60 కి తగ్గాయని అధికారుల నివేదికలు చెబుతున్నాయని ఆయన అన్నారు. జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదు కావడం జల వనరులలో నీటి నిల్వ తక్కువ ఉండడం వల్ల వచ్చే వేసవిలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో త్రాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని దీనిని దృష్టిలో పెట్టుకొని సోర్స్ స్టోరేజ్ సిస్టమ్ డిస్ట్రి బ్యూషన్ సిస్టమ్ లను పున సమీక్షించి సోర్స్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకూ మిషన్ భగీరథ అధికారులు పంచాయితీ రాజ్ ఆర్ అండ్ బి మున్సిపల్ అధికారులు మూడు రోజుల్లోగా ఎక్సర్ సైజ్  పూర్తి చేయాలన్నారు. 

చేప పిల్లల విత్తన ఉత్పత్తికి మానేరు జలాశయం కేంద్ర బిందువు కావాలి

తెలంగాణ మొత్తానికీ చేప పిల్లల విత్తన సరఫరా కు రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని విధాలుగా అనువుగా ఉందని మధ్య మానేరు జలాశయం కేంద్రంగా చేప పిల్లల విత్తన ఉత్పత్తి కి కేంద్ర బిందువుగా చేసి ఇక్కడి నుంచే తెలంగాణలోని అన్ని జలాశయాలకు చేప పిల్లలను సరఫరా చేసే కార్యచరణ సిద్ధం చేయాలని మంత్రి ఫిషరీస్ అధికారులకు  సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆర్డీఓ లు ఆనంద్ కుమార్ మధు సూదన్ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్