25.8 C
Hyderabad
Thursday, June 13, 2024
హోమ్తెలంగాణమాతృభూమిపై మమకారంతో వికలాంగులకు చేయూత

మాతృభూమిపై మమకారంతో వికలాంగులకు చేయూత

మాతృభూమిపై మమకారంతో వికలాంగులకు చేయూత

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి

బాలవికాస వ్యవస్థాపకురాలు బాలక్క ప్రతినిధులు వితంతువులకు చీరలు వికలాంగులైన విద్యార్థిని విద్యార్థులకు బ్యాగు నోట్ బుక్స్ పెన్నులు వాటర్ బాటిల్ నూనె ప్యాకెట్ నిత్యవసర సరుకులతో కూడిన కిట్టు ను పంపిణీ చేశారు. ఫిబ్రవరి నెలలో బాలవికాస వ్యవస్థాపకురాలు బాలక్క పుట్టినరోజును పురస్కరించుకొని ముందస్తుగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వారి ప్రతినిధులు పిల్లి జ్యోతి, నిర్మల శ్రీమతి వితంతువులకు చీరలను వికలాంగులకు నిత్యవసరాల కిట్టును బాలవికాస ద్వారా అందజేశారు కుటుంబం ఉద్యోగరీత్యా కెనడాలో స్థిరపడినప్పటికిని తెలంగాణ రాష్ట్రంలో పుట్టినందుకు మాతృభూమి యొక్క ప్రేమను పంచుకొనుటకు ఇక్కడ ప్రజలకు ఏదైనా చేయాలని తపనతో బాలవికాస సంస్థను స్థాపించి చాలా గ్రామాలలో నీటి శుద్ధీకరణ కేంద్రాలను అలాగే మరుగుదొడ్లను ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలను ఏర్పాటుచేసి ఇక్కడ ప్రజల కు తోడ్పాటుగా నిలిచారు. వితంతువులకు మన ధైర్యాన్ని నింపుతూ  మానవసేవే మాధవసేవ అని తలచి సమాజ సేవకు ఎంతో కృషి చేస్తున్న బాలక్క ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో క్షేమంగా ఉండాలని వితంతువులు ఆమెను దీవించారు. ఈ కార్యక్రమంలో బాలవికాస వాటర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కేడం లింగమూర్తి హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వైస్ చైర్మన్ అనిత ఫ్లోర్ లీడర్ పద్మ బాలవికాస వాటర్ ఫెడరేషన్ మెంబర్ బంక చందు వెన్నరాజు మల్లేశం శ్రీధర్ బాలవికాస వివిధ మండలాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్