30.2 C
Hyderabad
Wednesday, June 12, 2024
హోమ్తెలంగాణమాతృమూర్తులను సన్మానించిన: జిల్లా అదనపు కలెక్టర్

మాతృమూర్తులను సన్మానించిన: జిల్లా అదనపు కలెక్టర్

మాతృమూర్తులను సన్మానించిన: జిల్లా అదనపు కలెక్టర్

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి 

జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులను సన్మానించిన జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్.. బుదవారం చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో జాతీయ బాలికల దినోత్సవన్ని ఘనంగా నిర్వహించారు. టెన్ మినిట్స్ కార్యక్రమంలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)  గరీమా అగర్వాల్ గ్రామంలోని అంగన్వాడి సెంటర్-2ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన సేవలను పిల్లల తల్లిదండ్రులు గర్భిణీలు బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని  బాలికలకు జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు మహిళా శిశు సంక్షేమ శాఖ బాలికల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతి ప్రధానం చేసి డిసెంబర్ జనవరిలలో ఆడపిల్లలకు జన్మనిచ్చిన మాతృమూర్తులను  సన్మానించి అంగన్వాడి ఆవరణలో మొక్క నాటి బాలికల యొక్క తల్లులచే మొక్కలు నాటించారు. ఆనంతరం అదనపు కలెక్టర్ స్థానిక ప్రభుత్వ పాఠశాలను సందర్శించి 10వ తరగతి  విద్యార్థులతో పరీక్షలు బాగా  సన్నద్ధం కావాలని పిల్లలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని  అన్నారు. అనంతరం రామంచ గ్రామంలో తడి చెత్త పొడి చెత్త డంపింగ్ షెడ్డును డిపిఓతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రాంగోపాల్ రెడ్డి జిల్లా పంచాయతీ అధికారి  దేవకీదేవి జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిని విజయ రాణి  ఎంపీడీవో  గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ వార్డు సభ్యులు  వివిధ శాఖల అధికారులు  ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్