25.7 C
Hyderabad
Sunday, June 23, 2024
హోమ్తెలంగాణముఖ్యమంత్రికి లోక్ సత్తా పార్టీ బహిరంగ లేఖ

ముఖ్యమంత్రికి లోక్ సత్తా పార్టీ బహిరంగ లేఖ

ముఖ్యమంత్రికి లోక్ సత్తా పార్టీ బహిరంగ లేఖ

-నాణ్యమైన విద్య అందించాలని డిమాండ్

హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి 26 మే 2024 

రాష్ట్రంలోని పాఠశాలలలో విద్యార్థుల నమోదు ప్రపంచ స్థాయి సగటును తొంభై తొమ్మిది శాతం దాటినప్పటికీ కూడ ఆ స్థాయిలో మౌలిక సౌకర్యాలు, నాణ్యమైన విద్య   కల్పించడంలో గత ప్రభుత్వాలు విఫలం అయ్యాయని దిగజారిన పాఠశాల విద్యా ప్రమాణాలను మెరుగు పరచడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చికిత్స ప్రారంభించాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో  మంచి ప్రమాణాల విద్యను అందించటానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కి ఈ – మెయిల్ ద్వారా పంపిన బహిరంగ లేఖలో కోరారు. గ్రామీణ ప్రాంతంలోని తెలుగు మీడియం పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ఉన్నత విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో ప్రోత్సహించాలని ఆయన కోరారు.  రాష్ట్రంలోని  ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతీ విద్యార్థిపై ప్రతీ ఏటా 60వేల రూపాయల పైన ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదని దీనిపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే తగు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్ని బడులలో మౌలిక సదుపాయాలు త్రాగునీరు, వంట గదులు, భోజన హాల్లు, మరుగుదొడ్లు, ల్యాబ్, గ్రంధాలయం, క్రీడా ప్రాంగణాలు వుండేలా చర్యలు తీసుకోవాలని  శిధిలావస్థలో వున్న బడులకు  మరమ్మత్తులు  విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే  చేపట్టాలని తుమ్మనపల్లి ప్రభుత్వానికి కోరారు. ఇంకా ఈ సమావేశంలో కార్యదర్షులు సరోజాదేవి, మల్లాది కిషోర్, కారుమంచి గణేష్,మురళీ, విద్యా కమిటీ కన్వీనర్ వంశీ ప్రసాద్, సభ్యులు వరుణ్, సుబ్రమణ్యం, ప్రాణేష్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్