25.7 C
Hyderabad
Sunday, June 16, 2024
హోమ్తెలంగాణముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లోక్ సత్తా పార్టి బహిరంగ లేఖ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లోక్ సత్తా పార్టి బహిరంగ లేఖ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లోక్ సత్తా పార్టి బహిరంగ లేఖ

* ప్రతీ పది వేల జనాభాకు డాక్టర్ చొప్పున నియమించాలి.

* విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి.

* రాష్ట్రంలో కనీసం 200 నుండి 250 సకల హంగులతో చిన్న పట్టణాలను నిర్మించాలి.

* బడ్జెట్ లోనే స్థానిక ప్రభుత్వాలకు న్యాయమైన వాటా నిధులను కేటాయించాలి.

హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి 

రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యంగా 23 అంశాల్లో ఈ 2024-25 బడ్జెట్లో తగు విధంగా నిధులు కేటాయించాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇచ్చిన హామీలను నేరవెర్చే క్రమంలో దీర్ఘ కాలిక ప్రజా ప్రయోజనాలను విస్మరించరాదని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు విజ్ఞప్తి చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 గాను బడ్జెట్ ప్రవేశ పెట్ట నున్నందున రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే వివిధ కార్యక్రమాలపై 23 అంశాలలో శాశ్వత పరిష్కారం కోరుతూ ఈ –  మెయిల్ ద్వారా వినతి పంపించిన అనంతరం హైద్రాబాద్ లోని కార్యాలయంలో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వివరించారు. ముఖ్యంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి ప్రతీ పది వేల జనాభాకు ఒక డాక్టర్ చొప్పున ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ, పోలీసు వ్యవస్థను ఆదునీకరించాలి రాష్ట్రంలో కనీసం 200 – 250 అన్ని సౌకర్యాలతో చిన్న పట్టణాలను నిర్మించాలి, స్థానిక ప్రభుత్వాలకు 73,74 రాజ్యాంగ సవరణల ద్వారా సంక్రమించిన అధికారాలను, విధులను, నిధులను, సిబ్బందిని వెంటనే దాఖలు పరచాలి, ఈ బడ్జెట్ లోనే స్థానిక ప్రభుత్వాలకు న్యాయమైన వాటా నిధులను కేటాయించాలి, వ్యవసాయ మార్కెట్లను రైతులకే అప్పగించాలి, ప్రతిఏటా ఉద్యోగ నియామకాల కేలెండ రును విడుదల చేయాలి, ప్రభుత్వకార్యాలయాల్లో అవినీతి అక్రమాలకు తావులేకుండా పౌర సేవలు మెరుగు పడేలా సిటిజన్ ఛార్టర్లకు చట్టబద్దత కల్పించాలి, భూనిర్వాసితుల సంక్షేమానికి వెయ్యి కోట్ల నిధులతో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి, భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ డివిజనల్ స్థాయిలో సివిల్ కోర్టు అధి కారాలతో  రెవెన్యూ కోర్టులను, ఏర్పాటు చేయాలి, కుల వృత్తులను కుటీర పరిశ్రమగా గుర్తంచి రాయితితో కూడిన రుణాలు అందజేసి ప్రోత్సహించాలి, ప్రతీ నియోజకవర్గం మహిళా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసి 100 రోజుల్లో కుటుంబ వివాదాలు పరిష్కరించాలి అని ఈమెయిల్ ద్వారా పంపించిన లేఖలో కోరారు. ఉప ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర మంత్రులకు అధికారులకు పంపించినట్లు ఆయన తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నందిపేట రవీందర్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస వర్మ కార్యదర్శులు సరోజాదేవి రంగా చారి నాగభూషణం కృష్ణమూర్తి వంశీ ప్రసాద్ చిన్న కేశవ ప్రబుదాసు జీవన లత భవాని తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్