35.2 C
Hyderabad
Wednesday, April 17, 2024
హోమ్తెలంగాణమెదక్ పార్లమెంట్ లో బీఅర్ఎస్ గెలుపు ఖాయం

మెదక్ పార్లమెంట్ లో బీఅర్ఎస్ గెలుపు ఖాయం

మెదక్ పార్లమెంట్ లో బీఅర్ఎస్ గెలుపు ఖాయం

గజ్వేల్ మార్చ్ 23, యదార్థవాది ప్రతినిధి:

బీఅర్ఎస్ మెదక్ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్ రాం రెడ్డి విజయం సాధించడం ఎవరు ఆపలేరని కొండపాక మండల బీఅర్ఎస్ అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ అన్నారు. శనివారం దుద్దెడ గ్రామంలో ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ సిద్దిపేట కలెక్టర్ గా చేసిన వెంకట్రాం రెడ్డి డ్వామా పీడీగా, అడిషనల్ కలెక్టర్ గా, జాయింట్ కలెక్టర్ గా, జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించి ప్రజల మనిషి గా పేరు తెచ్చుకున్నాడని, ఇక్కడి ప్రజలకు ప్రజల బాధలు, కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలకు అభ్యర్థిగా దొరకడం మెదక్ పార్లమెంటు నియోజవర్గ ప్రజల అదృష్టమని తెలిపారు. మాజీ ముఖ్య మంత్రి, కేసిఆర్, హరీష్ రావు నాయకత్వంలో వెంకటరామిరెడ్డి  తెలంగాణలోనే భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఆశభావం వ్యక్తం చేసారు. అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని హామీలు నెరవేర్చకుండా కాలం గడుపుతున్నరని, ప్రజల్లో కాంగ్రెస్ పైన నమ్మకాలు పోయాయానాన్నారు. అలాగే ఇంకో బీజేపీ మతం పేరుతో  పబ్బం గడుపుకుంటుందని తప్పా  ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు.అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజల హక్కులను నీరుగారుస్తున్న బిజెపి, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు  పార్లమెంటు ఎన్నికల్లో తరిమికొడతారని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆరెస్ పార్టీ ఘన విజయం సాధించడం పక్కా అన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్