24.7 C
Hyderabad
Thursday, June 13, 2024
హోమ్తెలంగాణమేనిఫెస్టో లోని ప్రతి హామీ నెరవేర్చుతాం: మంత్రి పొన్నం

మేనిఫెస్టో లోని ప్రతి హామీ నెరవేర్చుతాం: మంత్రి పొన్నం

మేనిఫెస్టో లోని ప్రతి హామీ నెరవేర్చుతాం: మంత్రి పొన్నం

హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి:

హైదరాబాద్ సచివాలయంలోని మంత్రి పొన్నం తన ఛాంబర్ లో వేములవాడ ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర మున్నూరు కాపు సంఘాల నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వెనుకబడిన కులాల్లో మున్నూరు కాపు కులానికి న్యాయం చేయాలని తమ కులంలో ఎక్కువ శాతం కుటుంబాలు వ్యవసాయం పైనే జీవనం సాగిస్తున్నారని మంత్రికి వివరించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టిన విధంగా మున్నూరు కాపు కార్పొరేషన్ ని ఏర్పాటు చేయాలని మున్నారు కాపు సంఘ నేతలు మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. ఇప్పుడిప్పుడే తమ కులంలో అక్షరాస్యత పెరుగుతుందని మున్నూరు కాపు కార్పొరేషన్ ఫెడరేషన్ ఏర్పాటు చేస్తే తమ సంఘాలకు కొంత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. బీసీ వెల్ఫెర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ బీసీ వర్గాలకు అన్నిటికి కలిపి బీసీ ఫెడరేషన్ ఉంటుందని 36 కులాలకు ఎంబీసీ కార్పొరేషన్ ఉందన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్  నేత్రుత్వంలో మున్నూరు కాపు కార్పొరేషన్ పై శాఖ పరంగా చేయాల్సినవి చేస్తామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మున్నూరు కాపు కార్పొరేషన్ పై వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇప్పటికే పలుమార్లు తమ దృష్టికి తోసుకొచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత ప్రభుత్వాలు మున్నూరు కాపు కార్పొరేషన్ ని ఏర్పాటు చేయలేకపోయాయని తమ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు 2014లొ ఎంపీ గా ఉన్నప్పుడు కరీంనగర్ వేములవాడ లో మున్నూరు కాపు భవనాలకు  10 లక్షల చొప్పున కేటాయించానని మంత్రి గుర్తు చేశారు మున్నూరు కాపు కార్పొరేషన్ కావాలంటే సంఘల్లో మున్నూరు కాపు  రాజకీయ చైతన్యం రావాలని మున్నూరు కాపు నేతలు కూడా ఎమ్మెల్యేలు మంత్రుల దృష్టికి తీసుకెళ్ళని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో బీసీ సంక్షేమం పై జరిగే సమావేశంలో మున్నూరు కాపు కార్పొరేషన్ పై సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. సమావేశంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బీసీ వెల్ఫెర్  ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం మున్నూరు కాపునకు  చెందిన వివిధ సంఘల నేతలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్