31.2 C
Hyderabad
Monday, June 24, 2024
హోమ్తెలంగాణయువత నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి: అదనపు కలెక్టర్ 

యువత నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి: అదనపు కలెక్టర్ 

యువత నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి: అదనపు కలెక్టర్ 

సిద్దిపేట మార్చ్ 4 యదార్థవాది ప్రతినిధి:

పార్లమెంటరీ సంస్థల పనితీరును యువత అర్థం చేసుకునేందుకు వీలుగా యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఎన్ వై కే ఎస్ భారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జిల్లా స్థాయిలో యూత్ పార్లమెంట్ నిర్వహించడం జరుగుతోందని అదనపు కలెక్టరు గరిమ అగ్రవాల్ అన్నారు. నెహ్రూ యువ కేంద్ర సిద్దిపేట  ఆధ్వర్యంలో జిల్లా స్థాయి నైబర్‌హుడ్ యూత్ పార్లమెంట్ ఎన్ వై కే ఎస్ 2024, సిద్దిపేట పట్టణంలోనీ విపంచి కళ నిలయం హాల్లో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టరు గరిమ అగ్రవాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి స్వామి వివేకానంద పటానికి పూల మాల వేసి నివాళి అర్పించి అమే మాట్లాడుతూ యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ద్వారా వారు తమ పూర్తి సామర్థ్యాన్ని గ్రహించేలా ఈ ప్రక్రియలో దేశ నిర్మాణానికి సహకరించేలా ఇలాంటి వేదికలు ఉపయొగపడతాయని, యూత్ పార్లమెంట్ సెషన్‌లో లేవనెత్తిన అంశాలు యువత అభివృద్ధి, సామాజిక-ఆర్థిక అభివృద్ధి, శాంతి & భద్రతకు సంబంధించినవి, మానవ హక్కులు, ఆరోగ్యం మరియు విద్య, నైపుణ్యం,జీవనోపాధి, ఉపాధికి సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.

* నైబర్‌హుడ్ యూత్ పార్లమెంట్ ఎన్ వై కే ఎస్ లక్ష్యాలు..

వివిధ స్థాయిలలో సంస్థాగత వేదికను రూపొందించడం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యాలు, యువత వివిధ సమస్యలపై తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడం వారి జీవితాలను ప్రభావితం చేసే అటువంటి సమస్యలు/ఆందోళనల పట్ల స్థానిక పరిపాలన దృష్టిని ఆకర్షించడం యువతకు ప్రత్యక్షంగా బహిర్గతం చేయడం..

మాక్ పార్లమెంట్ ప్రోగ్రామ్ ద్వారా పార్లమెంటరీ విధానాల చట్రంలో తోటి యువతతో సంభాషణలో పాల్గొండం వలన, ప్రభుత్వం యొక్క వివిధ కార్యక్రమాల గురించి యువతకు అవగాహన దాని ప్రభావాన్ని చర్చించి వారి అనుభవాలు ఆలోచనలను పంచుకుంటుంది, పంచాయతీరాజ్ వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా యువతకు సంబంధించిన వివిధ సమస్యలపై చర్చ జరిపి,వివిధ అంశాలపై అవగాహన కల్పించడం జరుగింది.

వివిధ శాఖల జిల్లా అధికారులు తమ తమ శాఖల ద్వార ప్రజలకు లబ్ధి చేకూరే వివిద విధానాలు, సంస్కరణలు, ప్రభుత్వ పథకాల గూర్చి అవగహన కల్పించారు.

మై భారత్ పోర్టల్ రిజిస్ట్రేషన్, బ్రీఫింగ్, న్యూ ఇండియాపై సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ సెషన్స్, న్యూ ఇనిషియేటివ్స్- చంద్రయాన్, కోవిడ్ వ్యాక్సినేషన్ మొదలైన వివిధ రంగాలలో ఇటీవలి కాలంలో దేశం సాధించిన వైఙనిక మరియు సాంకేతిక  విజయాల గురించి అవగాహన కల్పించడం జరిగినది.

విజన్ ఆఫ్ ఇండియా 2047, నారీశక్తి – మహిళా రిజర్వేషన్ మరియు మహిళల ప్రభావం నారీ శక్తి వందన్ అధినియం, జన్ ధన్ యోజన, బేటీ బచావో బేటీ పఢావో, స్వానిధి ద్వారా సాధికారత, స్థానిక సమస్యలపై మాక్ పార్లమెంట్ అనుకరణలో భాగంగా వివిధ కళాశాల యువత చురుగ్గా పాల్గొన్నారు 

భారత రాజ్యాంగం చట్టాలపై మెరుగైన జ్ఞానం అవగాహన.ప్రపంచవ్యాప్తంగా, జాతీయ యువజన పార్లమెంటులు క్రియాశీల-పౌరసత్వాన్ని ప్రోత్సహించడానికి విశ్వసనీయమైన యంత్రాంగాలుగా ఉద్భవించాయి. ప్రపంచవ్యాప్తంగా యువత పార్లమెంటరీల నిర్మాణం, కూర్పు నిర్వహణ విధానాలలో తేడాలు ఉన్నప్పటికీ, యువతకు నిర్దిష్టమైన యువత సంబంధిత సమస్యలు ముఖ్యంగా, జాతీయ ప్రాముఖ్యత ఉన్న విషయాలపై వారి దృక్కోణాలను పంచుకోవడానికి

ఆందోళనలను వ్యక్తీకరించడానికి వేదికలను అందిస్తుంది.

డా.పల్లవి సైంటిస్ట్,అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల వారు మిల్లెట్స్ ఉపయోగాల గూర్చి అరోగ్యకరమైన చిరు ధాన్యాల పై  యువతకు  అవగాహన కల్పించారు.అలాగే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సుపరిపాలన సూత్రాలు మరియు ఆచరణలో యువకుల విజ్ఞానం, నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను పెంపొందించడంలో యూత్ పార్లమెంట్‌లు నిజానికి కీలకపాత్ర పోషిస్తున్నాయి అని తెలిపారు. కార్యక్రమానికి జిల్లా కార్యక్రమ అధికారి జి కిరణ్ కుమార్, లీడ్ బ్యాంకు మేనేజర్ సత్యజిత్ సెట్విన్ డిస్టిక్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ అమీనా బాను, జిల్లా యువజన క్రీడా అధికారి నాగేందర్, ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జి జీవన్ కుమార్, అకాడమిక్ మోనిటరింగ్ ఆఫీసర్ బేటి భాస్కర్, డాక్టర్ అయోధ్య రెడ్డి డి ఎంసి కోఆర్డినేటర్ వాసవి, పల్లవి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల సైంటిస్ట్,  ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం బోగి కృష్ణయ్య (మాక్ పార్లమెంట్ లో ప్రొటం స్పీకర్), పల్లవి, సువర్ణ దేశబోయిని నర్సింలు నేషనల్ యూత్ అవార్డు, అధికం రాజు గౌడ్ యువజన సంఘం అధ్యక్షుడు, బాయికాడ లక్ష్మణ్, నర్సింలు, కమ్మ శ్రీనివాస్, పులి ప్రవీణ్, సంజయ్ చిన్నరాంగారి వాలంటీర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్